దీపిక బికినీ పై షారుక్ క‌త్తెర ఇలా ప‌డింది!

Update: 2023-01-05 03:58 GMT
'ప‌ఠాన్' చిత్రంలో దీపికా ప‌దుకొణే న‌టించిన 'బేష‌రామ్' సాంగ్ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.  దీపిక ధ‌రించిన బికినీ రంగు స‌హా...ఆ పాట‌లో అమ్మ‌డి అందాల ఆర‌బోత‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ పాట‌ని తొల‌గించాల‌ని లేకుంటే విడుద‌ల కానివ్వ‌మంటూ కొన్ని రాష్ర్టాల్లో నిర‌స‌న సెగ‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

రాజ‌కీయంగానూ దీపిక వ్య‌వ‌హారం పెద్ద దుమార‌మే రేపింది. దీంతో ఆ పాట సెన్సార్ ముందుకెళ్ల‌డం..అక్క‌డా అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం జ‌రిగింది. పాట‌లోబోల్డ్ స‌న్నివేశాలు తొల‌గించాల‌ని సెన్సార్ ఆదేశించింది. తాజాగా అభ్యంత‌ర‌క సన్నివేశాల‌కు సంబంధించి టీమ్  ప్ర‌క్షాళ‌న మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తుంది. మూడు  నిమిషాల బేష‌రామ్ సాంగ్ లోని అభ్యంత‌ర‌క సన్నివేశాల‌కు క‌త్తెర ప‌డింది.

ట్రిమ్ చేయ‌గా ఒక నిమిషం నిడివి త‌గ్గుతుందిట‌. ప్ర‌ధానంగా దీపిక‌ బికినీ ..స్కిన్ షో స‌న్నివేశాలు తొల‌గించిన‌ట్లు తెలుస్తుంది.  ఈనెల 10న సినిమా టీజ‌ర్ రిలీజ్ అవుతుంది. ఆ రోజు ఈ ట్రిమ్డ్ వెర్ష‌న్ సాంగ్ని కూడా మ‌రోసారి రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. ఈ పాట విష‌యంలో  ఎడిటింగ్ బాధ్య‌త‌లు  మొత్తం షారుక్  తీసుకున్నారుట‌. ఆయ‌నే ద‌గ్గ‌రుండి ఎక్క‌డెక్క‌డ క‌త్తెర వేయాలి అని సూచించిన‌ట్లు స‌మాచారం.

మరి  క‌త్తెర ఎక్క‌డెక్క‌డ ప‌డింద్న‌ది ఆరోజు  క్లారిటీ వ‌స్తుంది. మొత్తానికి బేష‌రామ్ సాంగ్  వివాదానికి ఇక్క‌డితో పుల్ స్టాప్ ప‌డిన‌ట్లే. ఈపాట రాజ‌కీయంగానూ దుమారం రేపింది. భాజాపా..కాంగ్రెస్ పార్టీల మంత్రుల మ‌ధ్య ట్విట‌ర్ వేదిక‌గా పెద్ద యుద్ద‌మే జ‌రిగింది. త‌ప్పేముంద‌ని ప‌రోక్షంగా  అమితాబాచ్చ‌న్..ప్ర‌కాష్‌రాజ్ లాంటి న‌టులు దీపిక‌క మ‌ద్ద‌తుగా నిలిచినా  మెజార్టీ వ‌ర్గం వాటిని స‌మ‌ర్ధించ‌లేదు.

అలాగే 'ప‌ఠాన్' టైటిల్ పై ముస్లీం సంఘాలు కూడా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోన్న‌సంగ‌తి తెలిసిందే. ఇలాంటి వ‌ల్గ‌ర్ సినిమాకి ఆ టైటిల్ పెట్ట‌డం ఏంటి..వెంట‌నే  తొల‌గించి మ‌రో టైటిల్ తో సినిమా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. కానీ టైటిల్ విష‌యంలో సెన్సార్ ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో టైటిల్ తొల‌గించే అవ‌కాశం లేదని తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'పఠాన్' జనవరి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News