ఫోటో స్టోరీ: క్యాజువల్ లుక్ కానీ స్టన్నింగ్

Update: 2019-10-18 07:35 GMT
హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి పరిచయం అవసరం లేని పేరు పరిణీతి చోప్రా. మొదట్లో ప్రియాంక చోప్రా కజిన్ గానీ అందరూ గుర్తించేవారు కానీ తర్వాత తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. పరిణీతి ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలే ఉన్నాయి.  మొదట్లో పరిణీతి కాస్త బొద్దుగా ఉండేదే కానీ ఈమధ్య మాత్రం పర్ఫెక్ట్ బాలీవుడ్ బ్యూటీ లాగా జీరో సైజ్ కు మారిపోయింది. సోషల్ మీడియా ఫారెస్టు లో కార్చిచ్చు పెట్టడం మొదటినుంచి అలవాటే.

తను పోస్ట్ చేసే ఫోటోలే సోషల్ మీడియాలో హీటుకు కారణం అనుకుంటే అది పెద్ద పొరపాటు.  పరిణీతి బైట ఎక్కడ కనిపించినా ముంబై మీడియా వెంటనే తమ కెమెరాలలో బంధిస్తారు.,  ఆ ఫోటోలు కాస్తా వైరల్ అవుతాయి.  రీసెంట్ గా పరిణీతి ఒక డబ్బింగ్ స్టూడియో బైట కనిపించింది. ఆలస్యం చేయకుండా వెంటనే ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.  ఈ ఫోటోలలో పరిణీతి ఒక క్యాజువల్ స్ట్రైప్స్  షర్టు.. డెనిమ్ షార్ట్ ధరించి ఎంతో స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళింది.   బ్లాక్ అండ్ వైట్ స్లిప్పర్స్ ధరించి క్యాజువల్ లుక్ లోనే ఉన్నా మంచి స్మైల్ తో ఫోటోగ్రాఫర్లకు అభివాదం చేసింది.  చిరుగుల నిక్కర్ యమా స్టైల్ గా కనిపిస్తే పై బటన్లు వదిలేసిన షర్టు మహా సెక్సీగా కనిపించింది. మొత్తానికి బాలీవుడ్ భామ అనిపించింది.

ఇక సినిమాల విషయానికి వస్తే పరిణీతి ప్రస్తుతం 'సందీప్ ఔర్ పింకీ ఫరార్'.. ' భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'.. 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' చిత్రాల్లో నటిస్తోంది.  ఈ సినిమాలలో మొదటగా రిలీజ్ కానున్న చిత్రం 'సందీప్ ఔర్ పింకీ ఫరార్'. ఈ సినిమాలో హీరో అర్జున్ కపూర్ కాగా దర్శకుడు దిబాకర్ బెనర్జీ.  
Tags:    

Similar News