గోవా బ్యూటీ ఇలియానా కు ఇప్పుడంటే హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి కానీ గతంలో సూపర్ డిమాండ్ ఉండేది. టాలీవుడ్లో దాదాపుగా స్టార్ హీరోలందరితో నటించి సూపర్ హిట్లు తన ఖాతా లో వేసుకున్న ఇల్లీ బేబీ తర్వాత బాలీవుడ్ కు తరలిపోయింది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది కానీ హీరోయిన్ గా స్టార్ డమ్ అయితే రాలేదు. ఏదో అలానే నెట్టుకొస్తోంది. అయితే చాలా కాలం ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో ప్రేమ విషయంలో హాట్ టాపిక్ అయిన ఇల్లీ.. ఆ తర్వాత బ్రేకప్పు తో ఫేమస్ అయింది. ఇప్పుడు అవన్నీ మర్చి పోయి మళ్ళీ గ్లామర్ ప్రపంచం లో తన సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఇల్లీకి సోషల్ మీడియా ను ఆడుకోవడం 'దేవదాసు' కాలం నుంచే అలవాటు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే అండ్రూగారి బ్రేకప్పు.. డిప్రెషన్ పుణ్యమాని ఇల్లీ కాస్త ఒళ్ళు చేసింది. అందరి ఇళ్ళల్లో కొబ్బరిబొండాల తరహాలో జనాలో ఉన్నా ఎవరికీ ఇబ్బంది ఉండదు కానీ ఒక హీరోయిన్ కాస్త లావయితే చాలు సూటి పోటి మాటల తో సాధిస్తారు.. ట్రోలింగ్ లతో వేధిస్తారు. దీంతో ఈమధ్య ఇల్లీ బేబీ తన ఫోటోలను పోస్ట్ చేసే సమయంలో టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రయోగిస్తోందని తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజల క్రితం ఇల్లీ బ్లాక్ అండ్ వైట్ జమానా నాటి ఫోటోలను 'త్రోబ్యాక్' అని చెప్పకుండా పోస్ట్ చేసి నెటిజన్లను మాయ చేయ్యబోయింది. అయితే ఇరుక్కుంది. మరోసారి అలాంటి సందర్భమే ఎదురైంది.
ఇల్లీ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఆఫ్ కోర్స్.. డిన్నర్ కోసం నీ కుక్క ఇక్కడ ఉండొచ్చు.. కానీ నువ్వు ఉండకూడదు." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ తో పాటుగా #మనుషుల కంటే కుక్కకే ఎక్కువ విలువ" అనే ఒక హ్యాష్ టాగ్ ను జోడించింది. ఇల్లీ చెప్పేది గోవా ఫిలాసఫీ కాబట్టి నిజమే అయి ఉంటుంది. ఒప్పుకుందాం.. ఫిలాసఫి బాగుంది కానీ ఫోటో విషయం లో మాత్రం అనుమానాలు వస్తున్నాయి. ఈ ఫోటో లో ఇల్లీ ఎంత సన్నగా ఉంది అంటే కొత్త 'మహానటి' తరహాలో ఉంది.
అసలు ఇల్లీ ఇంత సన్నగా ఎప్పుడూ లేదు. దీంతో ఇల్లీ నాజూకుగా కనిపించేందుకు ఏదో ఫోటో షాప్ వాడిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫోటో చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. డైటింగ్ చేసి.. ఎక్సర్ సైజులు చేసి సన్నబడడం కష్టమైనప్పుడు ఎలా ఉందో అలా ఫోటోలు పోస్ట్ చెయ్యాలి. ఈ గ్రాఫిక్స్ ఎందుకు? ఇలాంటి గ్రాఫిక్స్ ఎంత వాడినా కొన్ని రోజుల తర్వాత బయట కనిపిస్తే అసలు బండారం బయట పడుతుంది కదా? బ్రేకప్ తర్వాత ఇల్లీ ఎక్కువ గా లాజిక్కుల గురించి ఆలోచిస్తున్నట్టు లేదు.