ఫోటో స్టోరి: షాడో ఉమెన్ ని ప‌ట్టుకోండి చూద్దాం!

Update: 2021-03-13 17:30 GMT
`వార్` చిత్రంతో వాణీక‌పూర్ పేరు మ‌రోసారి జాతీయ స్థాయిలో మార్మోగిన సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీ టాప్ మోడ‌ల్ గా.. `ఆహా క‌ల్యాణం` బ్యూటీగా తెలుగు వారికి సుపరిచిత‌మైన ఈ బ్యూటీ అప్ప‌ట్లో అంత‌గా మ‌న‌వాళ్ల‌కు క‌నెక్ట‌వ్వ‌లేదు. కానీ `వార్` చిత్రంలో అద్భుతంగా న‌టించింది అంటూ కితాబు అందుకుంది.

ఆ త‌ర్వాతా య‌ష్ రాజ్ సంస్థ‌ ఆస్థాన నాయిక‌గానే కొన‌సాగుతోంది వాణీ. ఇప్ప‌టికిప్పుడు ప‌లు క్రేజీ చిత్రాల్లో నాయిక‌గా న‌టిస్తోంది. షంషేరా .. బెల్ బాట‌మ్ లాంటి భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే ఛండీఘ‌ర్ క‌రే ఆషికీ అనే ప్రేమ‌క‌థా చిత్రంలోనూ ఈ అమ్మ‌డు వేడెక్కించ‌నుంది.

మ‌రోవైపు వ‌రుస‌గా మ్యాగ‌జైన్ ఫోటోషూట్ల‌తోనూ మెరుపులు మెరిపిస్తోంది వాణీ. ఇదే కోవ‌లో మ‌రో హాట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. సిల్వ‌ర్ కోటెడ్ మెటాలిక్ లుక్ తో నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంత హాట్ గా క‌నిపించింది ఈ ఫోటోలో. వాణీ డిజైన‌ర్ లుక్.. థై షోస్ నెటిజ‌నుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ``నీడ ను క్యాచ్ చేయ‌డం తోనే.. స‌బ్ స్టాన్స్ ని కోల్పోకుండా ఉండగ‌లం`` అన్న ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News