ఫోటో స్టోరీ : వింటర్ లో వేడెక్కించే అందాలు..!

Update: 2022-11-09 12:16 GMT
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా సరే అందాల భామ అషు రెడ్డి అదిరిపోయే హాట్ స్టిల్స్ ప్రత్యక్షం అవుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచేసిన అమ్మడు సోషల్ మీడియాని షేక్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే అమ్మడు అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అసలు ఆమె అంటే ఎవరో తెలియని దగ్గర నుంచి ఆమె అంటే ఎవరికీ తెలియకుండా ఉండదు అనుకునే స్థాయికి చేరింది అషు రెడ్డి. టిక్ టాక్ వీడియోస్ తో హైప్ తెచ్చుకుని బిగ్ బాస్ ఛాన్స్ తో క్రేజ్ తెచ్చుకుంది.

బిగ్ బాస్ తర్వాత అషు రెడ్డి ఫేట్ పూర్తిగా మారిపోయింది. ఆ షో ద్వార కెరియర్ సూపర్ సక్సెస్ చేసుకున్న వారిలో అషు రెడ్డి ఒకరు. ఆ షో ద్వారా వచ్చిన పాపులారిటీని ఇంకాస్త పెంచేందుకు ఫోటో షూట్స్ మార్గం ఎంచుకుంది అషు. తను షేర్ చేస్తున్న ఫోటో షూట్స్ కి విపరీతమైన లైక్స్, షేర్లు వస్తుండటంతో ఇక రెచ్చిపోవడం మొదలు పెట్టింది. ఈమధ్య గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచి అమ్మడు చేస్తున్న హాట్ షో కుర్రాళ్లకి చెమటలు పట్టించేస్తుంది. ప్రస్తుతం ఫారిన్ లో ఉన్న అషు రెడ్డి డల్లాస్ లో తన గ్లామర్ షో చేస్తుంది.

మోడ్రెన్ అవుట్ ఫిట్ తో ఫోటో షూట్ చేసిన అషు తన సంపదలు మొత్తం కనిపించేలా కేక పెట్టించేస్తుంది. మరి అమ్మడు ఏదో పెద్ద స్కెచ్ వేసే ఈ రేంజ్ లో అందాలను గుమ్మరిస్తుందని అంటున్నారు నెటిజెన్లు. అంతేకాదు ఫారిన్ లో ఓ పక్క ఫోటో షూట్ చేస్తూ.. మరోపక్క ఇన్ స్టా రీల్స్ చేస్తూ అషు రెడ్డి అదుర్స్ అనిపిస్తుంది. మరి గ్లామర్ ట్రీట్ లో పి.హెచ్.డి చేసిన అషు అందాల అరాచకం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. కొన్నాళ్లు బుల్లితెర మీద షోలు చేసిన అషు వాటిని కూడ వదిలేసి విహార యాత్రలు చేస్తుంది.

ఈ షో ఏదో సినిమాల్లో చేస్తే కాస్త ఇమేజ్ అయినా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే అషు సినిమాల కన్నా ఇలా సోషల్ మీడియా తోనే పాపులర్ అవ్వాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే అమ్మడికి సినిమా ఛాన్సులు వస్తున్న వాటిని చేయడానికి సుముఖంగా లేదన్నట్టు టాక్. మరి ఎన్నాళ్లని ఈ అందాల హంగామా చేస్తుందో కానీ అషు గ్లామర్ ట్రీట్ కి నిద్రపట్టక బాగా డిస్ట్రబ్ అవుతున్నారు ఫాలోవర్స్. అషు అందాల తాకిడి.. దేవుడా ఈ అందాలను తట్టుకోవడం ఎలా అంటూ కామెంట్స్ తో అషు ఇన్ బాక్స్ నింపేస్తున్నారు ఫాలోవర్స్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News