ఒకటి కాదు రెండు కాదు నాలుగు ప్రేమ కథల్ని ఒకే సినిమాలో ఒకే హీరో పెర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో `వరల్డ్ ఫేమస్ లవర్`లో చూపిస్తున్నారు క్రాంతి మాధవ్. నటుడిగా తనని తాను మరో లెవల్లో ఆవిష్కరించుకునే అరుదైన అవకాశం విజయ్ దేవరకొండకు వచ్చింది. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్- కేథరిన్- రాశీ ఖన్నా- ఇజబెల్లా లాయిటే వంటి అందగత్తెలతో విజయ్ రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ లో ఘాటైన రొమాన్స్ డైలాగ్స్ కి అద్భుత స్పందన వచ్చింది.
ఇందులో విజయ్ ఓ భగ్న ప్రేమికుడి గా కనిపించనున్నాడు. డిఫరెంట్ వేషధారణల్లో విజయ్ కనిపిస్తున్నాడు. ఇందులో అర్జున్ రెడ్డి తరహా లుక్ పై ఆసక్తికర చర్చ సాగింది. అలాగే ఐశ్వర్యా రాజేష్ అతడికి భార్య పాత్రలో కనిపిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆదివారం సాయంత్రం ప్రీరిలీజ్ వేదికపై విజయ్ నలుగురు ప్రియురాళ్ల తో ఇచ్చిన ఫోజు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఒక రచయిత నాలుగు ప్రేమకథల్ని ఊహించుకుంటే అన్నిట్లోనూ తనే హీరో. ఆ నలుగురు భామలతో రొమాన్స్ ని ఫాంటసీ కథాంశం రూపంలో క్రాంతి మాధవ్ ప్రయోగమే చేస్తున్నాడు. ఈ సినిమా విజయ్ కే కాదు.. క్రాంతి మాధవ్ కి చాలా కీలకమైనది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత గ్యారెంటీ హిట్ కోసం క్రాంతి మాధవ్ చాలానే శ్రమించారు. ఇదే తన చిట్ట చివరి ప్రేమకథా చిత్రమని దేవరకొండ అంటున్నాడు. ఇందులో అన్ని గెటప్పుల్లో నటించే భాగ్యం తనకు దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ప్రీరిలీజ్ వేదికపై కనిపించిన నలుగురు ప్రియురాళ్ల లో అందరూ ట్రెడిషనల్ గానే కనిపిస్తున్నారు. రాశీ రెడ్ లో సంథింగ్ హాట్ గా కనిపిస్తుండగా.. కేథరిన్ మునుపెన్నడూ లేనంత సంప్రదాయ బద్ధంగా కనిపిస్తోంది. ఇక ఇజబెల్లా వైట్ లో మోడ్రన్ గా కనిపిస్తుంటే .. ఐశ్వర్యా రాజేష్ తన పాత్రకు తగ్గట్టే డీగ్లామరస్ లుక్ లో కనిపించింది. నలుగురు భామల నడుమ దేవరకొండ స్పెషల్ గా ఆకట్టుకున్నాడు. ప్రేమికులరోజు కానుకగా జనవరి 14న ఈ సినిమా రిలీజవుతోంది. దేవరకొండ తాను చెప్పినట్టే సిక్స్ కొడతాడా లేదా? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు.