బులుగు జిలుగు స‌ముద్రంలో బికినీ ట్రీట్

Update: 2020-01-24 09:17 GMT
స‌మ్మర్ రాక‌ముందే మాల్దీవులు హీటెక్కిపోతున్నాయ్. నిరంత‌రం సెలబ్రిటీల ర‌ద్దీ పెరుగుతోంది ఇక్క‌డ‌. ఇటీవ‌ల డ‌జ‌ను పైగా సినీసెల‌బ్రిటీలు మాల్దీవుల విహారానికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అందాల ప‌రిణీతి చోప్రా మాల్దీవుల్లో అగ్గి రాజేస్తోంది. అక్క‌డ బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో చాలా ముందే స‌మ్మ‌ర్ హీట్ తెచ్చేసింది. ప్ర‌స్తుతం పారీ స్విమ్ సూట్ కం బికినీ ఫోటోలు యువ‌త‌రం వాట్సాపులు సోష‌ల్ మీడియాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. బులుగు జిలుగు మ‌హాస‌ముద్రంలో ప‌రిణీతి బ్లాక్ స్విమ్ సూట్ ట్రీట్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఓవైపు సినిమాలు.. మ‌రోవైపు వెబ్ సిరీస్ అంటూ పారీ ఇటీవ‌ల చాలా బిజీగా ఉంది. అందుకే చిన్న‌పాటి గ్యాప్ తీసుకుని సేద దీరేందుకు మాల్దీవుల విహారం ప్లాన్ చేసింది. 31 ఏళ్ల ఈ హాటీ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ లో అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేసింది. బులుగు జిలుగు స‌ముద్రంలో బ్లాక్ స్విమ్ సూట్ ధరించి బ్లాక్ సన్ గ్లాసెస్ తో జ‌ల‌కాలాడుతూ కెమెరా కు పోజులిచ్చింది. ``సముద్రం మధ్య లో ఒక ఊయ‌ల ఊగెను`` అంటూ పరిణీతి వ్యాఖ్య‌ను జోడించింది. మాల్దీవులు నాకు రెండో ఇల్లు లాంటిది. ఇక్క‌డ విహారాన్ని ఆస్వాధిస్తాను.. అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. స‌ముద్రంలో కొంత చోటివ్వ‌మ‌ని కొంటెగా అడిగేసింది మ‌రి.

కెరీర్ సంగ‌తి చూస్తే.. పరిణీతి చోప్రా చివరి సారిగా అర్జున్ కపూర్ స‌రస‌న `జబారియా జోడీ`(2019) అనే చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ స‌హా `సందీప్ ఔర్ పింకీ ఫరార్` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. నెట్ ఫ్లిక్స్ `ది గర్ల్ ఆన్ ది ట్రైన్ అండ్ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` సిరీస్ లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. 2011 లో `లేడీస్ వర్సెస్ రికీ బెహ‌ల్` అనే చిత్రం తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పరిణీతి చోప్రా.. గోల్‌మాల్ ఎగైన్- హసీ తో ఫాసీ- ఇషాక్ జాదే- కిల్ దిల్ వంటి చిత్రాల్లో నటించింది.


Tags:    

Similar News