ఫోటో టాక్ : 'వేదం' బ్యూటీ బికినీతో మళ్లీ వచ్చింది

Update: 2022-07-21 08:30 GMT
దీక్ష సేథ్‌ అనగానే టక్కున గుర్తుకు రాకపోవచ్చు.. కానీ వేదం.. మిరపకాయ్‌.. గోపీచంద్ వాంటెడ్‌ సినిమాల్లో నటించిన హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకు రావచ్చు. హీరోయిన్ గా వేదం సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆ తర్వాత సూపర్‌ హిట్‌ చిత్రం మిరపకాయ్ లో నటించింది. ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది కాని కెరీర్‌ ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు.

తెలుగు తో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేసింది. కాని ఏ ఒక్కటి కూడా వర్కౌట్‌ అవ్వలేదు. దాంతో గత అయిదు ఆరు సంవత్సరాలుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది.

హీరోయిన్ గా దీక్ష ఇక కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. కాని సోషల్‌ మీడియా  లో మాత్రం ఈమె సందడి చేస్తుందని అంతా భావించారు.

కానీ సోషల్‌ మీడియా లో కూడా గత రెండు సంవత్సరాలుగా ఈమె యాక్టివ్‌ గా ఉండటం లేదు. దాంతో సోషల్‌ మీడియా జనాలు కూడా దీక్ష గురించి మర్చి పోతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా తన బికినీ ఫోటోలతో ఇన్‌ స్టా గ్రామ్ లో సందడి చేసింది. గుర్తు పట్టనంత గా మారిన ఈ అమ్మడు బికినీ లో మరింత అందంగా కనిపిస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి.

దీక్ష సేథ్‌ ను కొత్త గా బికినీ లో చూసిన వారు వావ్‌ అంటూ కామెంట్స్ తో ఆమె అందం ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మళ్లీ సినిమాల్లో ప్రయత్నిస్తే.. ముఖ్యంగా బాలీవుడ్‌ సినిమా ల్లో ఈ అమ్మడికి ఖచ్చితంగా మంచి ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న ఈ అమ్మడు త్వరలోనే మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనే చర్చ మొదలు అయ్యింది.

సినిమా ల్లో రీ ఎంట్రీ కోసమే చాలా కాలం తర్వాత ఇలా సోషల్‌ మీడియా లో హాట్‌ ఫోటోలు షేర్‌ చేసింది అనేది కొందరి అభిప్రాయం. అసలు విషయం ఏంటి అనేది ఆమె స్పందిస్తే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Tags:    

Similar News