నిండు గర్భంతో దీపిక!!

Update: 2017-07-03 13:55 GMT
దీపికా పదుకొనే ఎంతటి ట్యాలెంటెడ్ బ్యూటీ అనే విషయం ఇప్పటికే అనేక మార్లు ప్రూవ్ అయిపోయింది. ఇటు అందంతో పాటు అటు నటనతోనూ మెప్పించే ఈ బ్యూటీ.. పర్సనల్ లైఫ్ విషయంలోనూ పెద్దగా దాపరికాలు పెట్టుకోదు. రణవీర్ మీద తనకున్న ఇష్టాన్ని చాటేందుకు ఏమాత్రం సంశయించదు.

దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే సంగతి అందరికీ తెలిసినా.. ఇప్పటికి మాత్రం ఇది సీక్రెట్. ఎందుకంటే.. అదే మాట ఇప్పటివరకూ వారిలో ఎవరి నోటి వెంట రాలేదు. అలాగని తమ ప్రేమను సీక్రెట్ గా ఉంచాలని వారెప్పుడూ అనుకోలేదు. ప్రపంచానికి చాటి చెబుతూ ఎంచక్కా కలిసి చక్కర్లు కొట్టడం.. ఈవెంట్స్ కు కలిసి హాజరవడం.. ఒకరిని ఒకరు ప్రేమతో ప్రశంసించుకోవడం లాంటివి చాలానే జరిగాయి. ఇన్ని తెలిశాక కూడా.. ఇంకా అసలు విషయం చెప్పకపోవడాన్ని.. పైగా పెళ్లి మాట సంగతి ఎత్తకపోవడాన్ని.. ఓ ఫ్యాన్ వెరైటీగా క్వశ్చన్ చేశాడు.

రణవీర్-దీపికాల ఫోటోను షేర్ చేయగా.. ఇందులో దీపిక నిండు గర్భంతో ఉన్నట్లుగా ఫోటోషాప్ చేశారు. 'ఈ పాటికే ఇలాంటి సందర్భం ఉండాలి కదా దీప్ వీర్' అంటూ వారి పేర్లను కలిపేసి మరీ అడగడం విశేషం. దీనికి రియాక్షన్ ఇంకా ఏమీ రాలేదు కానీ.. ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్ పైనే దృష్టి పెట్టినట్లు తప్ప.. పెళ్లి పిల్లలు వరకూ ఇప్పట్లో వెళ్లేట్లుగా ఏం కనిపించడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News