ఫోటో స్టోరీ: దిశ-కాల్విన్ కెవ్వు కేక

Update: 2019-10-25 05:28 GMT
హాట్ నెస్ అనగానే చాలామంది పొట్టిగా ఉండే బట్టలు వేసుకోవడం.. స్కిన్ షో చేయడం అనుకంటారు కానీ అది నిజం కాదు.  ఫుల్లుగా బట్టలు వేసుకొని కూడా హాట్ గా కనిపించే భామలు ఉంటారు. క్వార్టర్ బట్టలే వేసుకుని కత్తిలా కనిపించే భామలూ ఉంటారు.  హాట్ గా కనిపించడానికి పర్ఫెక్ట్ షేప్ తో పాటు యాటిట్యూడ్ కూడా ఉండాలి.  రాఖి సావంత్ కూడా హాట్ గా ఉండడానికి ట్రై చేస్తుంటుంది కానీ పాపం.. చేతకాదు.  

అదే దిశా పటానిని తీసుకుంటే.. పాప ఏం చేసినా హాటే.  డ్రెస్ వేసుకున్నా కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ లో ఉన్నా.. డ్రెస్ బటన్లు విప్పి కాల్విన్ క్లెయిన్లు కనిపించేలా ఓ ఘాటు ఫోటో షూట్ చేసినా ఎబ్బెట్టుగా అనిపించదు. చూసినవారు ఫ్రైడే ఈవెనింగ్ మూడ్ లోకి క్షణంలో వచ్చేస్తారు.  దిశా కాల్విన్ క్లెయిన్ తో డీల్ కుదుర్చుకునే సమయంలో పక్కనే ఫెవికాల్ డబ్బాలు పెట్టుకున్నారో ఏమో కానీ ఆ బంధం 'వై ఫెవికాల్ కీ జోడీ కభీ నహీ టూటేగీ' అన్నట్టుగా మారిపోయింది.  అప్పటి నుంచి కాల్విన్ వారు సెక్సీ డిజైన్ లు ఉండే ఇన్నర్ వేర్లు ఇవ్వడం.. ఈమె వాటిని ధరించి వగలు పోవడం.. నెటిజన్లకు సెగలు రేగడం పరిపాటిగా మారింది.  

ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ మరోసారి ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "నా కాల్విన్లు. #సీకె 50 @కాల్విన్ క్లెయిన్" అంటూ మరోసారి ప్రచారం కల్పించింది. నిజానికి యాడ్స్ లో 80% పరమ చెత్తగా ఉంటాయి.  వాటిని చూడగానే వెంటనే రిమోట్ లో ఛానెల్ మార్చాలనో.. లేదా 'స్కిప్ యాడ్' నొక్కాలనో మనసు లాగేస్తుంది.  కానీ ఈ కాల్విన్ క్లెయిన్ అలా కాదు.  చూస్తూనే ఉండాలనిపిస్తుంది.  హాట్ గా ఉండడం ఎలా అని ఎవరైనా నేర్చుకోవాలంటే దిశా స్టైల్ ను ఫాలో అయితే చాలు. సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం 'మలంగ్' అనే చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమాలో హీరో ఆదిత్య రాయ్ కపూర్.  అనిల్ కపూర్.. కునాల్ ఖేము ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు
Tags:    

Similar News