తెలుగమ్మాయి ఇషా రెబ్బా సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతో అభిమానులకు ట్రీటిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ స్టా వేదికగా ఇషా రెబ్బా రెగ్యులర్ గా వీడియో షూట్లు.. ఫోటోషూట్లను షేర్ చేస్తుంటే అవి అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
కెరీర్ ఆరంభంలా ఇప్పుడు కూడా మడి కట్టుకుని కూర్చుంటే పనవ్వదని గ్రహించిన అమ్మడు నిబంధనలు సడలించినట్లే కనిపిస్తుంది. తనలో బోల్డ్ యాంగిల్ ని వీలైనప్పుడల్లా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఓ మలయాళం సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాల్లో రెచ్చిపోయిన ఈషా...ఆఫ్ ది స్ర్కీన్ కూడా హీటెక్కించడమే ఆలస్యం.
తాజాగా ఈషా ఓ ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఈషా టాప్ లో బ్లాక్ కలర్ వేర్ ధరించగా...బాటమ్ లో లెల్లో కలర్ స్కర్ట్ ధరించింది. లేక్ వాల్ ని అనుకుని నేలవైపు చూస్తూ బ్యూటీ కెమెరాకి ఫోజులిచ్చింది. గాలికి వదిలేసిన కురులతో ఫేస్ మొత్తం దాదాపు కవర్ చేసింది. దీంతో అమ్మడి ఫేస్ లో బ్యూటీ మిస్ అయింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. యువలో చర్చకు దారి తీసింది. రోజుకొక కొత్త ఫోటోతో అభిమానులకు టచ్ లోకి రావడం వెనుక అటెన్షన్ ఏంటి? అంటూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మరి ఈ తరహా ప్రయత్నాలైనా ఈ షా కెరీర్ ని స్పీడప్ చేస్తాయేమో చూడాలి.
ప్రస్తుతం మలయాళంలో 'ఒట్టు' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ్ లో 'అయిరామ్ జెన్ మంగల్' సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అలాగే వెబ్ సిరీస్ ల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇప్పటికే '3 రోజెస్' మొదటి సీజన్ లో నటించింది. ఈ అడల్ట్ కామెడీలో అమ్మడి పాత్రకి మంచి గుర్తింపు దక్కింది.
ఇక తెలుగులో అమ్మడి కెరీర్ నత్త నడకనే సాగుతోంది. వేగం ఏమాత్రం పుంజుకోలేదు. చివరి సారిగా అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లో ఓ చిన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు స్టార్ మేకర్ త్రివికమ్ నే 'అరవింద సమేత వీర రాఘవ' లో సునంద పాత్రని ఈషాకి ఆఫర్ చేసారు.
ఆ తర్వాత మరో పెద్ద సినిమా పడలేదు. ఈ నేపథ్యంలో మరోసారి మాటల మాంత్రికుడే మళ్లీ లిప్ట్ ఇవ్వాలేమో. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఏదైనా రోల్ కి ఆఫర్ చేస్తే ఈషాకి ఇంకొన్నాళ్లు నడిచి పోతుంది.