పిక్ టాక్ : పర్పుల్‌ కలర్ లో మెరిసి పోతున్న చిన్నారి పెళ్లికూతురు

Update: 2022-12-31 05:07 GMT
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ తో చిన్నప్పటి నుండే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ అవికా గౌర్‌. హీరోయిన్ గా ఉయ్యాలా జంపాలా సినిమాతో రాజ్ తరుణ్ తో కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ హీరోయిన్‌ గా మొదటి సినిమాతోనే సక్సెస్‌ ను దక్కించుకుంది.

చిన్నారి పెళ్లి కూతురు ఇమేజ్ నుండి బయట పడేందుకు అవికా గౌర్‌ అందాల ప్రదర్శణ చేసేందుకు ప్రయత్నించింది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించినా కూడా ఎక్కువ శాతం నిరాశపరచడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు రాలేదు.. పైగా ఆ సమయంలో కాస్త బరువు పెరగడంతో గ్యాప్ తీసుకని రీ ఎంట్రీ ఇచ్చింది.

రీ ఎంట్రీ లో కూడా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేక పోయింది. కానీ ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో మాత్రం సూపర్ హిట్‌ అయ్యింది.

స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అందంగా కనిపిస్తూ.. స్కిన్‌ షో చేస్తూ తన ఫాలోవర్స్ ను ఫుల్‌ గా ఎంటర్‌ టైన్ చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ పీస్‌ అంటూ టాక్ ను సొంతం చేసుకుంది.

అవికా గౌర్‌ తాజాగా ఈ పర్‌పుల్‌ కలర్‌ డ్రస్ లో చూపు తిప్పుకోనివ్వని అందంతో అలరిస్తోంది. ఆకట్టుకునే ఈ అమ్మడి అందం పర్‌పుల్‌ కలర్ డ్రస్ తో మరింత పెరిగింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

క్లీ వేజ్ షో తో పాటు మత్తెక్కించే చూపులతో అవికా వావ్‌ అనిపిస్తోంది. ఈ అమ్మడు మళ్లీ హీరోయిన్ గా బిజీ అయ్యే రోజులు ముందు ముందు ఉన్నాయి అనిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News