బిఫోర్ మ్యారేజ్.. ఆఫ్టర్ మ్యారేజ్! అంటూ ఒకప్పటిలా పాత చింతకాయ ఆలోచనల్ని నేటితరం ఎప్పుడో వదిలేసింది. అసలు పెళ్లి అనేది అడ్డు రేఖ (లైన్) కానే కాదు. అది ఒక సమాంతర రేఖ. భర్తతో పాటు భార్యామణి కూడా కెరీర్ పరంగా.. ఎలివేషన్ పరంగా.. హోదా పరంగా.. ఆస్తుల పరంగా ముందుకు సాగడం అన్నది ఈ మోడ్రన్ ప్రపంచం చూపించిన బాట. గౌరవమర్యాదల్ని ఇచ్చిపుచ్చుకోవడం సమానంగానే ఉంటుంది.
ఇక పద్మావత్ దీపిక పదుకొనే గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ దీపిక శిఖరం ఎత్తుకు ఎదిగింది. పద్మావత్ గా తనని తాను ఆవిష్కరించుకుంది. అందుకు అనుకూలంగా సఖుడు రణవీర్ సింగ్ నుంచి అన్నివిధాలా సహకారం ఉంది. ఇదిగో లేటెస్ట్ గా 83 వేడుకలో దీపిక పదుకొనే తన అందాల ప్రదర్శన విషయంలో హద్దులు చెరిపేసి చెలరేగిపోవడం చూస్తుంటే పెళ్లి తర్వాతా ఇంతగా చెలరేగిపోతోందే! అనేవారే ముక్కున వేలేసుకునేలా ఉంది.
1983 టీమిండియా వరల్డ్ కప్ విక్టరీ నేపథ్యంలో తెరకెక్కిన 83కి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా 83 నిర్మాతలు ఈ మూవీ ప్రత్యేక ప్రదర్శనను నగరంలో నిర్వహించారు. దీనికి వారి స్నేహితులు కుటుంబ సభ్యులతో పాటు చిత్రంలోని మొత్తం తారాగణం హాజరయ్యారు. ఈ చిత్రంలో కపిల్ దేవ్ భార్య రోమీ దేవ్ పాత్రను పోషిస్తున్న దీపికా పదుకొణె రెడ్ కార్పెట్ మీద అద్భుతంగా కనిపించింది. డైమండ్ నెక్లెస్ తో కూడిన ఆఫ్ షోల్డర్ గౌను ధరించిన ఈవెంట్ లో అంతా తలలు తిప్పి చూసేంత కిక్కిచ్చింది. ఫోటోగ్రాఫర్లు తనని వెంబడించి మరీ ఫోటోలను క్లిక్ చేయడంతో దీపిక నవ్వులు కురిపించింది. అదే సమయంలో కపిల్ దేవ్ పాత్రను పోషించిన దీపిక భర్త రణవీర్ సింగ్ బ్లాక్ బౌటీ- 3-పీస్ వైట్ సూట్ లో మెరుపులు మెరిపించాడు. ఈ కార్యక్రమంలో ఫోటోషూట్ల కోసం కలిసి పోజులిచ్చింది ఈ జోడీ.
పలువురు బాలీవుడ్ మాజీ క్రికెటర్లు 83 షోని వీక్షించారు. ఈ చిత్రం 1983 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు ఐకానిక్ ప్రపంచ కప్ విజయం కోసం ఎలాంటి మ్యాజిక్ చేసింది? అన్న కథతో తెరకెక్కింది. ఈ చిత్రంలో రణవీర్- దీపిక జంటతో పాటు పంకజ్ త్రిపాఠి- తాహిర్ రాజ్ భాసిన్- జీవా- సాకిబ్ సలీమ్- జతిన్ సర్నా- చిరాగ్ పాటిల్- దినకర్ శర్మ- నిశాంత్ దహియా నటించారు. హార్డీ సంధు- సాహిల్ ఖట్టర్- అమ్మీ విర్క్- ఆదినాథ్ కొఠారే- ధైర్య కర్వా- ఆర్ బద్రీ. ఈ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.