పిక్ టాక్ : ఎవడ్రా సామ్ అందంగా లేదన్నది

Update: 2023-01-10 09:04 GMT
స్టార్‌ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఆమె ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చింది. గతంలో రెగ్యులర్‌ గా తన హాట్‌ ఫొటో సూట్స్ తో సమంత అలరిస్తూ వచ్చేది. కానీ ఈమధ్య కాలంలో ఆమె అనారోగ్య సమస్యల కారణంగా కొత్త ఫొటో షూట్స్ అభిమానుల ముందుకు రాలేదు.

ఎట్టకేలకు శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత యొక్క ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రెస్ మీట్‌ లో కూర్చున్న సమయంలో ఆమె కళ్లద్దాలు పెట్టి.. కాస్త నలతగా ఉన్నట్లుగా అనిపించినా కూడా ప్రత్యేకంగా తీసుకున్న ఫొటో షూట్స్ తో మాత్రం సమంత అందం ఏమాత్రం తగ్గలేదు అన్నట్లుగా అందంగా ఉంది.

సమంత అందం గురించి శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్‌ రిలీజ్ ప్రెస్ మీట్ తర్వాత చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వారు ఈ ఫొటోలు చూసిన తర్వాత ఆమాటలు అనరు.

సమంత లో గ్లో తగ్గిందని.. సమంత అందం తగ్గిందని కామెంట్స్ చేసే వారికి ఈ ఫొటోలు చూపించాలి అన్నంత అందంగా సామ్ కనిపిస్తుంది.

అనారోగ్య సమస్యలను పట్టుదలతో జయించిన సమంత మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవ్వబోతుంది. ఈ అమ్మడు మొదటగా విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా యొక్క షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. శివ నిర్వాన దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. ఇక సమంత హిందీలో కూడా సినిమాలు చేయబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News