పిక్‌ టాక్‌ : సింగిల్‌ ఫ్రేమ్‌ లో అక్కచెల్లి అందాల జాతర

Update: 2022-05-18 06:30 GMT
తెలుగు లో ఎక్కువ సినిమాలు చేయకున్నా నేహా శెట్టి గురించి చిరుత సినిమాలో నటించడం వల్ల ఎప్పటికి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయిన నేహా శెట్టి ఇంకా వార్తల్లో ఉండటానికి కారణం ఆమె అందం. బాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో అడపా దడపా సినిమాల్లో నటించినా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఉంటుంది.

ఇన్ స్టా గ్రామ్‌ లో దాదాపుగా 15 మిలియన్‌ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు అందాల విందు విషయంలో తన ఫాలోవర్స్ ను ఎప్పుడు కూడా ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉంటుంది. తన ఫాలోవర్స్ కు రెగ్యులర్ గా ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందిస్తుంది.

ఇక ఈ అమ్మడు చెల్లెలు ఐషా శెట్టి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి జనాల్లో చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెల్సిందే.

హీరోయిన్‌ గా ఐషా శెట్టి ఈమద్య ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ ఇవ్వగానే కరోనా ఎంట్రీ ఇవ్వడం వల్ల కెరీర్‌ కాస్త ఇబ్బందుల్లో పడ్డట్లు అయ్యింది అనుకున్నారు. కాని అక్క మాదిరిగా చెల్లి కూడా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా గుర్తింపు రాకున్నా సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది.

ఈ శెట్టి సిస్టర్స్ రెగ్యులర్‌ గా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. వీరిద్దరు ఎప్పుడు టుగెదర్‌ ఫోటోలు షేర్‌ చేసినా కూడా వావ్‌ అంటూ జనాలు అబ్బరపడే విధంగా ఉంటారు. అలాంటి ఈ శెట్టి సిస్టర్స్ తాజాగా ఒక కవర్‌ పై సందడి చేశారు. ఇద్దరి నడుము అందాలను ఎక్స్ పోజ్‌ చేస్తూ.. క్లీవేజ్ షో తో పోటా పోటీగా ఎంటర్ టైన్ చేస్తున్నారు.

ఇద్దరి అందాల జాతర కు అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్ పీస్ లు అంటూ టాక్ ను దక్కించుకున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో వీరిద్దరి ఈ కవర్ ఫోటో వైరల్‌ అయ్యింది. ఇద్దరు కూడా అందంతో పాటు ఓరగా చూసే చూపులతో మతిపోగొడుతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నేహా శెట్టి షేర్‌ చేసిన ఈ ఫోటో కొన్ని నిమిషాల్లోనే లక్ష లైక్స్ ను దక్కించుకుంది.
Tags:    

Similar News