వీడియో : ఇండో పాక్‌ వార్‌ 'పిప్పా'

Update: 2022-08-16 05:00 GMT
బాలీవుడ్ యంగ్‌ హీరో ఇషాన్ కట్టర్‌ మరియు మృనాల్‌ ఠాకూర్‌ ముఖ్య పాత్రల్లో నటించిన పిప్పా సినిమా టీజర్ ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. 1971 లో జరిగిన ఇండియా పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తాజాగా విడుదల అయిన టీజర్ లో చూపించారు. ఈ మధ్య కాలంలో ఆర్మీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు ఉన్నాయి.

రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. బంగ్లాదేశ్‌ కాన్సెప్ట్‌ ను కూడా ఈ సినిమా లో చూపించారు. టీజర్‌ లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఇండియా మరియు పాకిస్తాన్‌ ల మధ్య యుద్దం ను ప్రకటించడం చూడవచ్చు. మొత్తానికి సినిమా లో యుద్ధ సన్నివేశాలు అత్యంత ఆకట్టుకునే విధంగా ఉంటాయని అనిపిస్తుంది.

ఇషాన్ కెరీర్‌ ఆరంభించి ఎంతో కాలం కాలేదు. అప్పుడే ఇలాంటి గొప్ప పాత్రను చేసే అవకాశం దక్కించుకోవడం చాలా పెద్ద విషయం అన్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా తో ఆయన నిరూపించుకుంటే తప్పకుండా భవిష్యత్తులో మంచి స్టార్‌ గా బాలీవుడ్ లో నిలదొక్కుకునే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక హీరోయిన్‌ మృనాల్ ఠాకూర్ ఇటీవలే సీతారామం సినిమా తో టాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తెచ్చిన సక్సెస్‌ ఆనందం లో ఉన్న మృనాల్‌ పిప్పా తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలు లేకపోలేదు. పిప్పా షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ను డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నారు.

ఇండియన్ ఆర్మీ మరియు వార్ నేపథ్యంలోని సినిమాలకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది. కనుక ఈ సినిమా ను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్‌ చేసి సౌత్‌ లో కూడా డబ్ చేస్తే మంచి ఫలితం సాధించే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.



Full View

Tags:    

Similar News