'ప్లే బ్యాక్' ట్రైలర్: గతం నుంచి ఓ అమ్మాయి భవిష్యత్తులోని అబ్బాయికి ఫోన్ చేస్తే..!
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా.. 'మల్లేశం' 'వకీల్ సాబ్' సినిమాలతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ''ప్లే బ్యాక్''. డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి, '1 నేనొక్కడినే' సినిమాకి కథ అందించిన హరి ప్రసాద్ జక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి రివ్యూస్ రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తెలుగు ఓటీటీ 'ఆహా' లో మే 21 నుంచి ''ప్లే బ్యాక్'' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
1993 టైం నుంచి నుంచి ఒక అమ్మాయి 2019 లో ఉన్న ఒక అబ్బాయికి ఫోన్ చేస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలను ఉత్కంఠభరితంగా చూపించబోతున్నట్లు 'ప్లే బ్యాక్' ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. గతం నుంచి అమ్మాయి భవిష్యత్తులో ఉన్న అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడటం అనే కాన్సెప్ట్ కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది ఇండియాస్ ఫస్ట్ క్రాస్ టైమ్ కనెక్షన్ మూవీ అని ట్రైలర్ లో పేర్కొన్నారు. గతంలో హీరోయిన్ కు ఏర్పడిన ప్రమాదాన్ని, వర్తమానంలో ఉన్న హీరో ఎలా పరిష్కరించగలిగాడు అనేది ఇందులో చూపించనున్నారు.
రెండు టైమ్ లైన్స్ ను కలపాలి అనుకుంటే ఏం జరుగుతుందనే పాయింట్ తో వచ్చిన ఈ 'ప్లే బ్యాక్' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దీనికి సినిమాటోగ్రాఫర్ కె.బుజ్జి అందించిన విజువల్స్.. మ్యూజిక్ డైరెక్టర్ కామ్రన్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నాయి. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇందులో ఇటీవల మరణించిన సినీ జర్నలిస్ట్ టీఎన్నార్ - సీనియర్ నటుడు సూర్య - అర్జున్ కళ్యాణ్ - స్పందన కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ రావు పెద్దినేని 'ప్లే బ్యాక్' చిత్రాన్ని నిర్మించారు.
Full View