మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు- తమిళం- హిందీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాన్ ఇండియా హిట్టు కొట్టాలని అమీర్ స్థానిక భాషల ప్రచార కార్యక్రమాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇప్పటికీ అమీర్ ఈ మూవీకి హైప్ తేవడంలో తడబడుతున్నారు ఎందుకనో. ఓవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున అంతటి వారు బరిలో దిగి అమీర్ ఖాన్ మూవీకి ప్రమోషన్ చేస్తున్నారు.
ఇంత చేస్తున్నా లాల్ సింగ్ చడ్డాకు పరిస్థితులు ఏవీ అనుకూలించలేదనే చెప్పాలి. దీనికి తోడు ఇటీవల #BoycottLaalSinghChaddha ట్విట్టర్ లో ట్రెండింగ్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అమీర్ ఖాన్ మౌనంగా ఉన్నారు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పటికి అమీర్ ఖాన్ ట్విట్టర్ ట్రెండ్ పై స్పందించారు. అంతేకాదు తన సినిమాని నిషేధించవద్దని అందరూ సినిమాను చూడాలని ప్రజలను అభ్యర్థించారు. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా లాల్ సింగ్ చద్దా ట్విట్టర్ ట్రెండ్ పై స్పందించమని అమీర్ ని మీడియా ప్రతినిధులు కోరగా ఈ ధోరణిపై అమీర్ తన ఆలోచనలను పంచుకున్నారు.
అమీర్ మాట్లాడుతూ.. ``అవును.. దీనికి నేను విచారంగా ఉన్నాను. అలాగే ఇలా మాట్లాడుతున్న కొందరి మనసులో నేను భారతదేశాన్ని ఇష్టపడని వాడినని నమ్ముతున్నందుకు బాధగా ఉంది. వారి హృదయాలలో అది నిజమని నమ్ముతారు.. కానీ అది అసత్యం. కొంతమందికి అలా అనిపించడం చాలా దురదృష్టకరం. అలా చేయకండి.. దయచేసి నా సినిమాని బహిష్కరించకండి. దయచేసి నా సినిమా చూడండి`` అని అమీర్ బతిమాలుతున్న ధోరణితో మాట్లాడారు.
#BoycottLaalSinghChaddha ట్రెండ్ అవుతుండగానే చిత్ర కథానాయిక కరీనా కపూర్ కి చెందిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కరీనా నెపోటిజం గురించి మాట్లాడుతోంది. ``నటవారసుల సినిమాలు చూడొద్దు.. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు`` అని కరీనా ఆ వీడియోలో అంటోంది. ఆ తర్వాత ఆమె `ఆప్ ఆర్హే హోన్ ఆ మూవీ దేఖ్నే మత్ ఆవో` అని చెప్పింది.
#boycottlaalsinghchaddha ట్రెండింగ్ లో ఉండటం ఇదే మొదటిసారి కాదు. మేలో `లాల్ సింగ్ చద్దా` ట్రైలర్ విడుదలయ్యాక వివాదాలతో కలకలం మొదలైంది. అప్పట్లో మైక్రోబ్లాగింగ్ సైట్ లో అమీర్ వివాదాస్పద ప్రకటనలు దీనికి కారణం. అతని సహనటి కరీనా కపూర్ ఖాన్ కూడా తన గత ప్రకటన కారణంగా ఇలాంటి ఒక ట్రెండింగ్ డ్రామాలో చిక్కుకుంది. అమీర్ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` ఆగస్టు 11న విడుదల కానుంది.
అమీర్ ఖాన్ గతంలో ఏం చెప్పాడు?
2015లో భారతదేశంలో పెరుగుతున్న అసహనం గురించి ఆరోపిస్తూ చేసిన ఓ వ్యాఖ్య కారణంగా అమీర్ ఖాన్ హెడ్ లైన్స్ లోకి వెళ్లాడు. ``మన దేశం చాలా సహనంతో ఉంది.. కానీ చెడును వ్యాప్తి చేసే వ్యక్తులు ఉన్నారు`` అని అమీర్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆయన మాజీ భార్య సినీ నిర్మాత కిరణ్‌రావు కూడా తమ పిల్లల భద్రత కోసం దేశం విడిచి వెళ్లాలని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించడంపై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పించారు. నెటిజనులు ఈ పాత స్టేట్ మెంట్ ను తీసుకొచ్చి ఆయనను హిందూ వ్యతిరేకి భారత్ వ్యతిరేకి అంటూ మండిపడ్డారు. ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా విడుదలకు ముందు ట్విట్టర్ లో వ్యతిరేక పవనాలు వీచడానికి గతం ఒక కారణంగా కనిపిస్తోంది. చర్య- ప్రతిచర్య దాని ప్రతిఫలాల్ని ఇప్పుడు చడ్డా ఎదుర్కొంటున్నారు.