ఈ కెమిస్ట్రీ అనేది ఉందే చాలా టఫ్ సబ్జెక్ట్. హీరో హీరోయిన్ల మధ్య స్క్రీన్ పై కుదిరిందనుకోండి.. సినిమా హిట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉంటాయి. అదే రియల్ లైఫ్ లో అయితే మొదట లవ్ గాసిప్పులు వస్తాయి. ప్రేమ ముదిరి పాకాన పడితే పెళ్ళి.. లేకపోతే ఎవరి దారి వారిది. కానీ ఇవేమీ లేకుండా జస్ట్ విజయ్ దేవరకొండతో ఎవరైనా హీరోయిన్ నటిస్తేనే జనాలు ఎఫైర్ గాసిప్పులు అల్లేస్తున్నారు. గతంలో చాలామంది ఈ గాసిప్పుల బారిన పడ్డారు ఇప్పుడేమో ఐశ్వర్య రాజేష్ వంతు వచ్చింది.
తమిళ హీరోయిన్ అయిన ఐశ్వర్య రాజేష్ తమిళంలోనే కాదు. మలయాళం. హిందీలో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈమధ్య విజయ్ దేవరకొండ తో కాస్త కెమిస్ట్రీ కుదిరిందని.. లవ్ లో పడిపోయిందని.. త్వరలో పెళ్ళి బాజాలు మోగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గుసగుసలు గుప్పుమన్నాయి. ఈ జెనరేషన్ హీరోయిన్లందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కదా. దీంతో ఈ విషయం ఐశ్వర్య రాజేష్ కు వెంటనే తెలిసిపోయింది.
దీంతో విజయ్ దేవరకొండ పేరు ఎత్తకుండా ఒక సుతిమెత్తగా సెటైర్ వేసింది. తన ట్విట్టర్ ఖాత ద్వరా "హే గైస్... నా ప్రేమ కథ గురించి పుకార్లు వింటూ ఉన్నాను. దయచేసి ఆ అబ్బాయి ఎవరో చెప్పండి.. తెలుసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. ప్లీజ్.. అలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయకుండా ఆపండి. అలా ఏదైనా ఉంటే.. మీకు చెప్పే మొదటి మనిషిని నేనే. ఇప్పటికైతే నేను సింగిల్ గా ఉన్నాను.. హ్యాపీ గా ఉన్నాను. వీకెండ్ ను ఎంజాయ్ చేయండి." అంటూ ట్వీట్ చేసింది. అయినా ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే ఐశ్వర్య దేవరకొండతో లవ్ లో పడిందని గాసిప్పువీరులు క్లియర్ గానే పేరు చెప్పారు కదా. ఇంకా "అబ్బాయి ఎవరో చెప్పండి".. అంటుంది ఏంటి?