పోకిరి రీ రిలీజ్.. మరో న్యూ రికార్డ్

Update: 2022-08-09 08:04 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును ఫాన్స్ ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ట్రెండ్ సెట్ చేసిన పోకిరి సినిమాను మరోసారి గుర్తు చేసుకుంటూ థియేటర్లో హంగామా  ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయయూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదివరకే చాలా సెంటర్లలో ఒక్కడు సినిమాను ప్రదర్శించగా అభిమానుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది.

మహేష్ బాబు కెరీర్ లో ఒక్కడు పోకిరి సినిమాలు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి సినిమాలను మళ్లీ థియేటర్స్ లో చూడాలి అని అభిమానులు కోరుకోవడంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేశారు.

అసలైతే ఒక 10 సెంటర్లలో మొదట 20 లేదా 50 స్క్రీన్ లలో ఈ సినిమాల ప్రదర్శనలు వేయాలని అనుకున్నారు. కానీ అభిమానులు తాకిడి మరింత ఎక్కువ కావడంతో టికెట్ల కోసం కూడా ముందుగానే సంప్రదింపులు జరపడంతో షోల సంఖ్యను పెంచాల్సి వచ్చింది.

నేటి టెక్నాలజీని ఉపయోగించుకొని సినిమాను 4K లోకి కన్వర్ట్ చేశారు. ఇక నేడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించిన పోకిరి షోలకు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి  దాదాపు 200 ధియేటర్లో హౌస్ ఫుల్ అవ్వడం విశేషం.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా పలుచోట్ల ఈ సినిమా స్పెషల్ షోలను వేయడం జరిగింది. రీ రిలీజ్ చేసిన తరువాత భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న ఫస్ట్ సినిమాగా పోకిరి నిలిచింది.

ముఖ్యంగా యూఎస్ లో మహేష్ బాబుకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అక్కడ కూడా 25 షోలకు పైగా ప్రదర్శించగా వాటికి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా రెండు రోజులకు ముందుగానే సోల్డ్ అవుట్ అయిపోయాయి. మహేష్ బాబు పోకిరి సినిమాకు ఎన్నేళ్ళయినా కూడా ఇదే తరహా రెస్పాన్స్ అందుతుంది అని మరోసారి మహేష్ అభిమానులు రుజువు చేశారు.
Tags:    

Similar News