రేప్-హ‌త్య చేసి చిత్ర‌పురిలో దాక్కున్నాడు!

Update: 2019-07-12 17:30 GMT
సినిమా 24 శాఖ‌ల కార్మికులు నివాసం ఉండే కాల‌నీగా `చిత్ర‌పురి` పాపుల‌ర్. వేలాదిగా సినీకార్మికులు ఇక్క‌డ నివాసం ఉంటున్నారు. అయితే అలాంటి కాల‌నీ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డేలా చేసింది ఆ ఘ‌ట‌న. అంత‌గా భ‌య‌పెట్టే ఘ‌ట‌న‌ ఏం జ‌రిగింది? అన్న‌ది ఆరాతీస్తే..

తాజాగా కాల‌నీలో పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ క్రిమిన‌ల్ ప‌ట్టుబ‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వేరొక‌ రాష్ట్రంలో హ‌త్య‌లు- రేప్ లు చేసి వచ్చిన ఓ బ్యాచిల‌ర్ (పేరు రివీల్ కాలేదు) క్రిమిన‌ల్ కొంద‌రు స్నేహితుల‌తో క‌లిసి ఇక్క‌డ‌ సింగిల్ బెడ్ రూమ్ లో అద్దెకు దిగాడు. చుట్టూ ఫ్యామిలీస్ ఉన్నా య‌జ‌మాని వీళ్ల‌కు అద్దెకు ఇచ్చాడు. అయితే అత‌డిని ఇటీవ‌లే రాయ‌దుర్గం పోలీసులు వెతుక్కుంటూ వ‌చ్చి అరెస్టు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ అరెస్టుతో అత‌డి నేరాల‌కు సంబంధించిన స‌మాచారం కాల‌నీ వాసుల‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చింది. పొరుగు రాష్ట్రంలో కేసుల విష‌యంలో పోలీసులు చాలా కాలంగా అత‌డిని వెతుకుతున్నార‌ని తెలిసింది. చివ‌రికి రాయ‌దుర్గం పోలీసుల స‌హ‌కారంతో కాల‌నీకి వ‌చ్చి అత‌డిని అరెస్టు చేశారు. అత‌గాడిపై ఉన్న నేరారోప‌ణ‌ల గురించి తెలిసి చిత్ర‌పురి వాసులు షాక్ కి గుర‌వుతున్నారు. నుదుటికి విభూతి బొట్లు పెట్టుకుని అమాయ‌క తంబీలా అత‌గాడి రూపం చూసి ఈయ‌నా? అంటూ అవాక్క‌య్యారంతా.

ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మేల్కొన్న చిత్ర‌పురి క‌మిటీ ప్రస్తుతం కాల‌నీలోని బ్యాచిల‌ర్లు అంద‌రినీ ఖాళీ చేయించేందుకు నోటీసులు పంపించింది. ఈ నెలాఖ‌రుతో మొత్తం బ్యాచిల‌ర్ల‌ను ఖాళీ చేయిస్తుండ‌డంపై ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారంతా. అలాగే కాల‌నీలో నివాసం ఉండే ప్ర‌తి ఒక్క‌రూ ఇక‌పై రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ లో కేవైసీ కి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందేన‌ని ఓన‌ర్ల సంఘం హుకుం జారీ చేయ‌డంతో విధిగా అంద‌రూ ఆధార్ కార్డులు స‌మ‌ర్పించి గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు.

హైద‌రాబాద్ సాఫ్ట్ వేర్ హ‌బ్ గా చెప్పుకునే గ‌చ్చిబౌళి-మ‌ణికొండ ఏరియాల‌కు కూత‌వేటు దూరంలో ఉన్న చిత్ర‌పురి ప్ర‌స్తుతం స‌క‌ల సౌక‌ర్యాల మ‌ణిహారంగా మారింది. ఇక్క‌డ అద్దెల రేంజు కూడా స్కైలోకి ఎగబాకింది. ఈ కాల‌నీకి రోడ్ క‌నెక్టివిటీ.. 24/7 వాట‌ర్ ఫెసిలిటీ ఉండ‌డంతో ఇక్క‌డ నివ‌శించేందుకు అంతా ఆస‌క్తిని చూపిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. చిత్ర‌ప‌రి ప‌రిస‌రాల్లోని టింబ‌ర్ లేక్ చెరువును తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అద్భుత‌మైన మినీ ట్యాంక్ బండ్ గా మార్చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇక్క‌డ కేబీఆర్ పార్క్ త‌ర‌హాలోనే వాక్ వే.. పార్క్ త‌ర‌హాలో అభివృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం భారీగా బ‌డ్జెట్ ని కేటాయించింది. చెరువు చుట్టూ రోడ్ క‌నెక్టివిటీని పెంచేందుకు వ‌ర్క్ జ‌రుగుతోంది.

    
    
    

Tags:    

Similar News