ఆ టీవి సిరీస్ లీక్.. మనోళ్ళ పనే

Update: 2017-08-15 04:56 GMT
ప్రస్తుత రోజుల్లో పైరసీ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు తీసేవాళ్లు సినిమా హిట్ గురించి ఆలోచించకుండా పైరసీ కాకుండా ఉంటే చాలు భగవంతుడా అని కోరుకునే స్థితిలో ఉన్నారు. ఇక సీన్స్ లీకేజ్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి. ఆ పరిస్థితి సినిమాల నుంచి టెలివిజన్ సిరీస్ వరకు వచ్చేశాయి.

రీసెంట్ గా ఇదే తరహాలో "గేమ్ ఆఫ్ త్రోన్స్" టెలివిజన్ సిరీస్ లీకేజ్ సంచలనం సృష్టించింది. ప్రపంచమంతటా ఈ టివి సిరీస్ తెగ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ సంస్థ కి చెందిన  "హాట్ స్టార్" ఆన్లైన్ ఛానెల్ లో గేమ్ ఆఫ్ త్రోన్స్ సెవెంత్ సీజన్ ను టెలికాస్ట్ చేస్తోంది. అయితే రీసెంట్ గా ఈ సిరీస్ యొక్క నాలుగవ ఎపిసోడ్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో ఆ సంస్థ ముంబై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ముఖ్యంగా లీకైంది ఇంటర్నల్ వీడియో. హెచ్.బి.ఓ వారి ఇండియన్ ఆన్ లైన్ స్ర్టీమింగ్ పార్టనర్ హాట్ స్టార్ వారు తమ వాడకం కోసం వాటర్ మార్క్ వేసి పెట్టుకున్న ఎపిసోడ్ లీకైంది.

దీంతో పోలీసులు లీక్ చేసిన వారిని అతి కొద్దీ గంటల్లోనే అరెస్ట్ చేశారు.  హాట్ స్టార్ కి సంబందించన ఉద్యోగులే 7వ సీజన్ యొక్క నాలుగవ ఎపిసోడ్ ని ఆన్ లైన్ లో లీక్ చేశారని డిసిపి అక్బర్ పఠాన్ తెలిపారు.దాదాపు 170 దేశాల్లో టెలికాస్ట్ అవుతున్న ఈ సిరీస్ ఒక్కసారిగా ఆన్లైన్ లో దర్శనం ఇవ్వడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఈ గేమ్ ఆఫ్ త్రోన్స్ 7వ సీజన్ బాగా పాపులర్ అయ్యింది. 10.2 మిలియన్ ప్రేక్షకులు ఒకేసారి వీక్షించడంతో న్యూ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
Tags:    

Similar News