సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూపై ఈ రోజు పోలీసు కేసు నమోదైనట్టు సమాచారం. తమిళనాడులోని థౌజెండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. ఆ జోరులో పడి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టుగా తెలుస్తోంది.
శుక్రవారం తన నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేపట్టిన ఆమె.. ఓ మసీదు ముందు కూడా తన ప్రచారం కొనసాగించినట్టు తెలుస్తోంది. ఎన్నికల నియమావళి ప్రకారం.. ప్రార్థనా స్థలాల ముందు ప్రచారం నిర్వహించడం నిషేధం. అయితే.. అక్కడ కూడా ఆమె ప్రచారం కొనసాగించారని తెలుస్తోంది.
మసీదు వద్ద నిర్వహించిన ప్రచారంలో.. తనకు ఓటు వేసి గెలిపించాలని ఖుష్బూ ప్రజలను కోరారని, అంతేకాకుండా.. అధికారుల అనుమతి లేకుండా మసీదు ముందు కరపత్రాలను కూడా పంచారని సమాచారం.
దీంతో.. అడిషనల్ ఫ్లయింగ్ స్క్వాడ్ కుచెందిన ఓ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కోడంబాక్కం పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఖుష్బూతోపాటు ఆమె పక్కన ఉన్న పలువురిపై ఐపీసీ 143, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.