ప్రముఖ సినీ నటిపై పోలీసుల చార్జిషీట్

Update: 2021-09-03 11:30 GMT
తమిళనాట ప్రముఖ సినీ నటి మీరా మిథున్ పై చెన్నై నగర పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. స్థానిక ఎగ్మోర్ కోర్టులో ఈ మేరకు సమర్పించారు. దీంతో ఆమెకు శిక్షపడడం ఖాయమని కొందరు అంటున్నారు. అనవసరంగా నోరు జారి నటి మీరా చిక్కుల్లో పడిందని చెబుతున్నారు.

దళితులపై నోరుజారి ఒక ప్రముఖ నటి మీరా మిథున్ అడ్డంగా బుక్కైంది. దారుణ వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనటి, బిగ్ బాస్ ఫేం మీరా తన విచిత్రమైన వ్యవహారశైలితో తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇతర నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది.

సెలబ్రెటీల పై ఇప్పటికే నోరు జారిన ఈ నటి మీరా ఇటీవల దళిత సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దళితులపై నటి మీరా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మీరా పై చెన్నై పోలీసులకు అందిన ఫిర్యాదులతో ఆమెపై కేసు నమోదు చేశారు. కేరళకు పారిపోయి దాక్కున్న ఆమెను పట్టుకొని మరీ అరెస్ట్ చేశారు.

దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విడుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నటిని అరెస్ట్ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం మీరా మిథున్ దళితులపై దారుణ వ్యాఖ్యలు చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో మీరాను అరెస్ట్ చేయాల్సిందిగా పెద్ద ఉద్యమం నడిచింది. దళితులు దుమ్మెత్తిపోశారు.

మీరా షేర్ చేసిన వీడియోలో ‘ఓ డైరెక్టర్ తన అనుమతి లేకుండా తన ఫొటోను అతడి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం వాడుకున్నాడని’ ఆరోపించింది. తక్కువ జాతి దళిత సామాజికవర్గానికి చెందిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. చాలా చీప్ గా ప్రవర్తిస్తారు’ అంటూ నోటికొచ్చినట్టు మీరా తిట్టిపోసింది. దళితులు నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం వల్లనే వారిని సమాజంలో నీచంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత, దర్శకులు, నటీనటులను బయటకు గెంటేయాలని సూచించారు.

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు మీరా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు చెన్నై పోలీసులు మీరాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా ఆమెపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మీరా బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొన్నారు. కొన్ని సినిమాలో నటిగా నటించారు.




Tags:    

Similar News