కోలీవుడ్ లో తెలుగు జెండా ఎగరేసిన విశాల్ పట్టుదల బాగా ఎక్కువ. అన్యాయాన్ని ఎదిరించే విషయంలో మనోడు కోలీవుడ్ లో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో పైరసీ సీడీలు తయారు చేసే షాపుల మీద నేరుగా అటాక్ చేసి.. వేరే హీరోల సినిమాల సీడీల్ని కూడా పట్టించిన ఘనత విశాల్ దే. ఆ తర్వాత నడిగర్ సంఘంలో అక్రమాల మీద ముందు గళం విప్పి.. దీని మీద పెద్ద చర్చ నడిచేలా చేశాడు. శరత్ కుమార్ అండ్ కో పై సంచలన ఆరోపణలు చేసి.. వాటి మీద ఇండస్ట్రీ అంతా కదిలేలా చేశాడు. తర్వాత శరత్ సహా పెద్ద పెద్ద వాళ్లను సవాల్ చేసి నాజర్ - కార్తి లాంటి వాళ్లతో కలిసి ఎన్నికల బరిలో కూడా నిలిచాడు. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించాడు.
ఇప్పుడిక తమ హామీల్ని నెరవేర్చడానికి కూడా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాడని కితాబులందుకుంటున్నాడు విశాల్. ఐతే ఎన్నికల గొడవ ముగిసింది కాబట్టి శరత్ కుమార్ ను అంత తేలిగ్గా ఏమీ వదిలేయట్లేదు విశాల్. తాజాగా శరత్ నేతృత్వంలోని పాత కార్యవర్గం చేసిన అక్రమాల్నింటినీ బయటికి తీస్తున్నాడు. నడిగర్ సంఘం పాత కార్యకలాపాల్ని - డాక్యుమెంట్లను పరిశీలించి.. అక్రమాల్ని గుర్తించిన విశాల్ శరత్ కుమార్ మీద లేటెస్టుగా ఓ కేసు కూడా వేశాడు. ఐతే శరత్ మాత్రం తాను సచ్ఛీలుడినని.. తాను పదవి నుంచి దిగిపోయేటపుడే అన్నీ క్లియర్ చేసి ఇచ్చానని అంటున్నాడు. ఐతే నిజానిజాలేంటన్నది పోలీసులు - కోర్టు తేల్చాల్సి ఉంది. ఐతే విశాల్ - శరత్ లకు ఈ నడిగర్ సంఘం శత్రుత్వంతో పాటు.. వేరే రైవల్రీ కూడా ఉంది. శరత్ కూతురు వరలక్ష్మి - విశాల్ లవర్స్. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. దీనికి శరత్ ఒప్పుకోవట్లేదన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో విశాల్ ఏదైనా రాజీ ఫార్ములాతో వస్తాడేమో అనుకుంటే.. ఎన్నికల తర్వాత కూడా శరత్ ను వదలకుండా ఏడిపిస్తూనే ఉన్నాడు.