బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ ది సూసైడ్ కాదని.. అతన్ని పథకం ప్రకారమే చంపివేసుంటారని.. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. రియా చక్రవర్తి సుశాంత్ ని మోసం చేసిందని.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందనే ఆరోపణలపై రియాపై పోలీసులు కేసు నమోదు చేసారు. దీంతో ఇప్పటి వరకు ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులోకి బీహార్ పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో బీహార్ పోలీసులు సుశాంత్ సోదరిని మరియు సుశాంత్ దగ్గర పనిచేస్తున్న సర్వెంట్ ని విచారించి కీలక అంశాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా సుశాంత్ సింగ్ సోదరి మితు సింగ్ ని బీహార్ పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించి సుశాంత్ కి పలు అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుశాంత్ ఆర్థికపరమైన అంశాల గురించి.. బ్యాంక్ డీటెయిల్స్.. రియాతో సంబంధం వంటి విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే సుశాంత్ దగ్గర గత కొంత కాలంగా పని చేస్తున్న సర్వెంట్ ని కూడా బీహార్ పోలీసులు విచారించారు. మితు సింగ్ మరియు సుశాంత్ సర్వెంట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని కూడా వారు రికార్డ్ చేసుకున్నారని సమాచారం. వీరితో పాటు సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండేని ఎంక్వయిరీ చేసి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. రియా సుశాంత్ ని వేధింపులకు గురి చేసిందని.. తనకి బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకున్నాడని తనతో చెప్పినట్లు వెల్లడించిందని సమాచారం. ఒక విధంగా ముంబై పోలీసుల కంటే ఇటీవల దర్యాప్తు ప్రారంభించిన బీహార్ పోలీసులు ఎక్కువ సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.