నిజంగా టాలీవుడ్ హీరోల అభిమానులను మెచ్చుకోవాలి. మహా అయితే సోషల్ మీడియాలో ట్రాలింగ్ కు పరిమితమవుతూ తమ హీరోల సినిమాలను ప్రోమోట్ చేయటం మినహా అంతకు మించి లిమిట్స్ దాటిన దాఖలాలు చాలా అరుదు. కానీ పక్కనే ఉన్న కోలీవుడ్ లో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా విజయ్ ఫాన్స్ కొందరు పిచ్చికి పరాకాష్టగా నిలుస్తూ ఏకంగా ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారు. సర్కార్ విషయంలో రేగిన వివాదం ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు.
ఇందులో కొన్ని సన్నివేశాల గురించి అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో వాటిలో కొన్ని తొలగించి కొన్ని మ్యూట్ చేసేలా నిర్మాతలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. మా హీరో సినిమాకు ఇలా చేస్తారా అంటూ కొందరు గతంలో వివిధ స్కీముల కింద తీసుకున్న గ్రైండర్లు టీవీలు పగలగొట్టగా ఓ విద్యార్ధి ఏకంగా జయలలిత ప్రభుత్వం ఇచ్చిన లాప్ టాప్ ముక్కలు చేసిన వీడియో వైరల్ అయ్యింది.
ఇదే అతి అనుకుంటే ఓ ఇద్దరు అభిమానులు తమ దేవుడి సినిమాకు ఇలా చేస్తారా నరికి పారేస్తాం అంటూ కత్తులు పట్టుకుని మరీ వార్నింగ్ ఇచ్చిన వీడియో తమిళనాట విపరీతంగా షేర్ అవుతోంది. ఇది తప్పుడు సంకేతాలు ఇస్తోందని గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ వీడియో చేసిన ఇద్దరిని పట్టుకునే పనిలో పడ్డారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఆ ఫ్యాన్స్ గురించి వేట తీవ్రంగా కొనసాగుతోంది. అయినా సినిమాను వినోద సాధనంగా చూడకుండా ఇలా వ్యక్తిగతంగా హీరోని హద్దులు మీరు ప్రేమించడం ఏమిటో కాస్త ఎవరికి వారు ఆలోచించుకుంటే మంచిది. ఈ పరిణామాల పట్ల విజయ్ మౌనంగానే ఉన్నాడు.