ప‌బ్ రైడ్. కేసులో నిహారిక విచార‌ణ‌

Update: 2022-04-03 08:31 GMT
హైద‌రాబాద్ లోని ప్ర‌ఖ్యాత‌ ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్ లో డ్ర‌గ్స్ పార్టీ ప్ర‌స్తుతం సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లో క‌ల‌క‌ల‌రం రేపుతోంది. ఈ పార్టీలో సినీసెల‌బ్రిటీలు స‌హా రాజ‌కీయ ప్ర‌ముఖుల వార‌సులు.. పోలీస్ బాస్ ల పుత్ర ర‌త్నాలు ఉన్నార‌ని తేల‌డంతో కేసు సంచ‌ల‌నంగా మారింది. ఈ శ‌నివారం రాత్రి ఉగాది ఫ‌ర్వ‌దినాన ఏకంగా 150 మంది సెల‌బ్ కిడ్స్ స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ కి దొరికిపోవ‌డంతో కేజు జాతీయ స్థాయిలో మార్మోగింది.

హోట‌ల్ రాడిస‌న్ కి చెందిన ఫుడింగ్ మింక్ ప‌బ్ లో నిన్న రాత్రి జ‌రిగిన ప‌బ్ పార్టీలో డ్ర‌గ్స్ సేవిస్తున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం అందుకుని టాస్క్ ఫోర్స్ రైడ్ చేసింది. ఈ రైడ్ లో దాదాపు 150 మందిని అరెస్టు చేయ‌గా.. బిగ్ బాస్ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు తొలిగా బ‌య‌టికి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ప్ర‌ముఖ న‌టుడి కుమార్తె సినీన‌టి కూడా ఉందంటూ క‌థనాలొచ్చాయి. అయితే ఎవ‌రు ఆ న‌టి అన్న ఆరాలు సాగాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక విజువ‌ల్స్ ఎల‌క్ట్రానిక్ మీడియాలో సంచ‌ల‌నంగా మారాయి. స‌ద‌రు మీడియాలు ప‌దే ప‌దే నిహారిక పేరును హైలైట్ చేస్తూ క‌థ‌నాల్ని ప్ర‌సారం చేస్తున్నాయి. గ‌త రాత్రి అదుపులో తీసుకుని దాదాపు 40 మందిని విచారించారు. అయితే ఇందులో చాలామందిని విడిచిపెట్ట‌గా 10 మందిని మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ విచారిస్తూనే ఉన్నార‌ని తెలిసింది.

ఇందులో నిహారిక కూడా ఉన్నారు. అయితే నిహారిక డ్ర‌గ్స్ సేవించారా లేదా? అన్న‌ది విచార‌ణ‌లో తేలాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. మ‌రోసారి నిహారిక విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఇక‌ నిహారిక బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ నుంచి వెళుతున్న దృశ్యాలు మీడియాలో హైలైట్ గా మారాయి.

మ‌రోవైపు ఇదే కేసులో ప్ర‌ముఖ టీడీపీ ఎంపీ కుమారుడు కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. అలాగే పోలీస్ బాస్ ల పుత్ర‌ర‌త్నాలు ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ప‌బ్ లో ప‌లువురు టాప్ సెల‌బ్స్ ఉన్న రూమ్ వెలుప‌లికి డ్ర‌గ్స్ ప్యాకెట్లు విసిరి వేసార‌ని కూడా తెలుస్తోంది. కొకైన్ ..ఎండీపీ లాంటి ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్స్ ని వినియోగించార‌ని టాక్ వినిపిస్తోంది. ప‌బ్ లో డ్ర‌గ్స్ దందా గుట్టుగా సాగుతున్నా పోలీసులు నిర్ల‌క్ష్యం వ‌హించార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ విష‌యంలో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శ‌న్ కి మెమో ని జారీ చేసింది పోలీస్ శాఖ‌.







Full View

Tags:    

Similar News