మలయాళ నటి భావన కిడ్నాప్ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసులో నిందితులెవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ప్రధానంగా అందరి వేళ్లూ సీనియర్ హీరో దిలీప్ వైపు చూపాయి. అతడి పేరెత్తకుండా భావన సైతం పరోక్షంగా తనే కుట్రకు సూత్రధారి అన్నట్లుగా మాట్లాడింది. ఐతే భావనను కార్లో కిడ్నాప్ చేసి.. ఆమెపై అటాక్ చేసిన నిందితుడు పల్సర్ సుని పోలీసుల విచారణలో దిలీప్ పేరు చెప్పలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పోలీసుల విచారణలో తన పేరు చెప్పనందుకు రూ.1.5 కోట్లు డిమాండ్ చేస్తూ పల్సర్ తనకు బెదిరింపు లేఖ పంపాడంటూ దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. మీడియా ముందుకొచ్చి భావనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
పల్సర్ సునిపై చర్యలు తీసుకోవాలంటూ తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా దిలీప్ చెబుతుంటే.. అదే సమయంలో దిలీప్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించడం హాట్ టాపిక్ గా మారింది. దిలీప్ ను.. అతడి మిత్రుడిని తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు 12 గంటలకు పైగా నిర్విరామంగా విచారించినట్లు కేరళలో మీడియాలో వార్తలొస్తున్నాయి. భావన కేసులో దిలీప్ ప్రమేయంపైనే పోలీసులు అనేక రకాలుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఐతే పోలీసు విచారణ అనంతరం బయటికి వచ్చిన దిలీప్.. ఈ కేసును పోలీసులు చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని వ్యాఖ్యానించడం విశేషం. తనకు కేరళ పోలీసులపై పూర్తి నమ్మకం ఉందని.. ఈ కేసులో నిందితులెవరో తేలుస్తారని.. తనకు మాత్రం భావన కిడ్నాప్ ఉదంతంతో ఎలాంటి సంబంధం లేదని అతను తేల్చి చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/