సుశాంత్ కేసులో ముంబై పోలీసుల కీలక అడుగు.. నిజాలు దొరుకుతాయా..?

Update: 2020-06-29 17:30 GMT
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయట పడుతుంది. సుశాంత్ కేసును ముంబై పోలీసులు చాలా సీరియస్ గా డీల్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు సుశాంత్ మృతిని మర్చిపోలేక పోతున్నారు. అతడిని హత్య చేసారంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున పోస్టులు పెడుతున్న కారణంగా విచారణను మరింత వేగవంతం చేసారు ముంబై పోలీసులు. సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని కన్ఫర్మ్ చేసినా.. బంగారం లాంటి కెరీర్ ఎందుకు వదిలేస్తాడు అనేది ఇంకా జవాబు దొరకని ప్రశ్న. అందుకే మరణానికి గల కారణాలు ఏమిటా అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఇండియాకు లేఖ రాశారు పోలీసులు. గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కొన్ని ట్వీట్స్ చేసి డిలీట్ చేసాడని.. వాటి స్క్రీన్ షాట్స్ తీసి అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాంతో ఈ అంశంపై పోలీసులు దృష్టి పెట్టి.. ఆ డిలీట్ చేసిన ట్వీట్స్‌ ఏంటనేది తెలుసుకోడానికి ట్విట్టర్ ఇండియాకు లేఖలో విన్నవించారు.

గతేడాది డిసెంబర్ 27న సుశాంత్ చివరి పోస్ట్ చేసాడని అంటున్నారు. అప్పట్నుంచి మళ్లీ సుశాంత్ ట్విట్టర్ ఓపెన్ చేయలేదా.. చేసి ట్వీట్స్ పెట్టి మళ్లీ డిలీట్ చేశాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక సుశాంత్ చనిపోయే రోజు ఉదయం సుశాంత్ మూడు ట్వీట్లు పెట్టి డిలీట్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఆ క్లారిటీ కోసమే శ్రమిస్తున్నారు. సుశాంత్ మృతిని ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు.. దానికి గల కారణాలను వెతికే పనిలో ఉన్నారు. ఇక ఇప్పటికే పోలీసుల విచారణలో భాగంగా 27 మంది వాయిస్ రికార్డులు చేసారట. ఇక సుశాంత్‌కు బాగా సన్నిహితులైన కొందరు స్నేహితులు సంచలన విషయాన్ని బయట పెడుతున్నారట. కొందరు కావాలనే సుశాంత్‌ను పగబట్టి మరీ కెరీర్ దెబ్బతీసి చనిపోయేలా చేసారని ఆరోపిస్తుంటే.. మరికొందరేమో తన ఇమేజ్‌ను దెబ్బ తీయాలని చూస్తున్నారని అంటున్నారు. ఇలాంటి చర్యలన్నీ సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొల్పాయని ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. మరి ట్విట్టర్ ఇండియా నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే అసలు నిజాలు బయట పడతాయని అంతా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News