కర్ణాటకలో సంచలనం సృష్టించిన శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో శాండిల్ వుడ్ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు.
ఇప్పుడు ఇదే కేసులో మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్పరాయ్ కొడుకు ‘రిక్కీ రాయ్’పై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పంజా విసిరారు. తాజాగా డ్రగ్స్ మాఫియాతో రాయ్ కొడుకుకు లింకులు ఉన్నాయని పోలీసులు తేల్చారు. ముత్తప్ప రాయ్ కు చెందిన బెంగుళూరులోని ఇల్లు, ఫామ్ హౌస్ లు, ఇళ్లపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి సోదాలు చేస్తున్నారు. అనంతరం రిక్కీరాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవలే మాఫియా మాజీ డాన్ ముత్తప్ప రాయ్ అనారోగ్యంతో మరణించాడు. బెంగళూరు శివార్లలో ఆయనకు అతిపెద్ద బంగ్లా ఉంది. అక్కడే ఆయన కుమారుడు రిక్కీ రాయ్ ఉంటున్నారు. ఈ క్రమంలోనే రిక్కీకి పోలీసులు నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వారితో.. తప్పించుకు తిరుగుతున్న నిందితులతో రిక్కీ రాయ్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటిపై దాడి చేశామని పోలీస్ కమిషనర్ పాటిల్ తెలిపారు.
డ్రగ్స్ దందా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరికీ రిక్కీ రాయ్ ఆశ్రయం ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులకు చిక్కకుండా పారిపోయిన వారికి ఆశ్రయం ఇవ్వడంతో రిక్కీ రాయ్ పై విచారణ జరపగా.. అతడికి డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతానికి రిక్కీ రాయ్ ను అరెస్ట్ చేయలేదని.. అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని కమిషనర్ పాటిల్ తెలిపారు. అయితే రిక్కీ రాయ్ ను అరెస్ట్ చేశారనే వార్తలు బెంగళూరు న్యూస్ చానెల్స్ లో వస్తున్నాయి.