మహేష్ బాబును ఆ పార్టీ హెచ్చరించిందా?

Update: 2017-09-27 16:34 GMT
మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేసింది. ఫారిన్ లో ప్రీమియర్స్ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే షోస్ పడిపోయాయి. కొన్ని చోట్ల అయితే.. ఉదయాన్నే వేసిన షోస్  పూర్తయిపోయాయి కూడా.

మరోవైపు మన సూపర్ స్టార్ ఇప్పటికే తన మరుసటి చిత్రం మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. అనౌన్స్ మెంట్ చేయకపోయినా.. భరత్ అను నేను అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేశారనే టాక్ ముందు నుంచి ఉంది. ఈ మూవీలో ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ కనిపించనుండగా.. ఇప్పుడీ మూవీ స్టోరీపై కొత్త టాక్ బయల్దేరింది. సహజంగా ఇలాంటి పొలిటికల్ మూవీస్ లో.. అధికార పక్షానికి వ్యతిరేకంగాను.. హీరో ముఖ్యమంత్రిగా మారేందుకు పాలకపక్షంలో ఉన్న చెడును ఎస్టాబ్లిష్ చేసేలా ఉంటాయి. మరి కొరటాల కథ ఏ టైపులో ఉంటుందో చెప్పలేం కానీ.. ఈ సినిమా కథ ప్రకారం.. మహేష్ బంధువు ఉన్న పార్టీకి వ్యతిరేకంగాను.. ప్రతిపక్షానికి కాసింత అనుకూలంగా ఉండేలా ఉందనే టాక్ ఒకటి బయల్దేరింది.

అధికారపక్షానికి వ్యతిరేకంగా ఎలాంటి సన్నివేశం కూడా ఉండేలా జాగ్రత్తపడాలని ఇప్పటికే సూచనలు లాంటి బెదిరింపులు మహేష్ దగ్గరకు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. ఒక సినిమా విషయంలో అధికార పార్టీ నేరుగా రంగంలోకి దిగి.. సినిమా టీం ను బెదిరించే కల్చర్ మన దగ్గర ఇప్పటివరకూ లేదు. కానీ ముందు జాగ్రత్తలు ఇప్పుడు ఎవరికీ తప్పేట్లు లేవు.


Tags:    

Similar News