ఒక సినిమా రాజకీయ వర్గాల్లో అధిపత్య పోరును రాజేసింది. మాట్లాడేవాడే మొనగాడన్నట్లు.. బాహుబలి టిక్కెట్లు ఇప్పించే వాడే పోటుగాడన్నట్లుగా వ్యవహారం మారింది. ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైంది. చోటా నాయకులు.. పోలీసుల వర్గాలు మాత్రమే పెద్ద పెద్ద సినిమాల విషయంలో కాస్తంత జోక్యం చేసుకొని.. పైరవీలు చేసేవారు.
కానీ.. బాహుబలి సినిమాకు ఆ హద్దులు చెరిగిపోయి.. బడా నేతలు సైతం ఫోన్లు కలిపే పరిస్థితి. ఎవరికి వారు తమ తమ పవర్ చూపిస్తూ టిక్కెట్ల కోసం ఒత్తిడి చేస్తుండటం థియేటర్ యాజమాన్యాలకు చుక్కలు కనిపించే పరిస్థితి. ఎవరినికాదంటే ఏమవుతుందో అర్థం కాక తల పట్టుకుంటున్నారు.
ఇలాంటి ఘటనకు ఉదాహరణగా హైదరాబాద్‌లో జరిగిన ఒక ఉదంతాన్ని చెబుతున్నారు. ఒక తెలుగుదేశం నేత హైదరాబాద్‌లోని మల్టీఫ్లెక్స్‌ల్లోని మొత్తం టిక్కెట్లను బుక్ చేసేశాడంట. ఈ విషయం ఒక టీఆర్‌ఎస్ ముఖ్యనేతకు తెలిసి రంగంలోకి దిగి.. టిక్కెట్లు మాకు కావాలని పట్టుబట్టారట. దీంతో.. టీడీపీ నేతకు కేటాయించిన టిక్కెట్లలో కోత పెట్టి మరీ..సదరు టీఆర్‌ఎస్ నేతకు సర్దుబాటు చేశారట.
ఇలాంటి వ్యవహారం తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ కనిపిస్తోంది. విశాఖపట్నం.. విజయవాడ.. నగరాల్లో ఆన్‌లైన్‌లోకి కాసిన్ని టిక్కెట్లు పెట్టేసి.. మిగిలిన టిక్కెట్లలో అత్యధిక భాగం ఆయా ఎమ్మెల్యేలకు పంపిణీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. నగరాలు.. పట్టణాల్లో పరిస్థితి ఇలా ఉంటే చిన్న ఊళ్లల్లో కూడా చోటా నేతలు హడావుడి చేస్తున్నారట. ఇప్పటివరకూ థియేటర్ల సిబ్బందికి నేతల నుంచి ఫోన్ అన్న మాట ఉండేది కాదట. అలాంటిది బాహుబలి పుణ్యమా అని వారికి ఫోన్లు వెళ్లి.. తమ్మీ.. ఈ టిక్కెట్ల లల్లి జర సూడు.. పని అవ్వాలే అంటూ చెబుతున్నారట. మొత్తంగా బాహుబలి.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అధిపత్యానికి ఒక సవాలుగా మారిందని చెబుతున్నారు. ఇలాంటి సిత్రాలు బాహుబలి ఇంకెన్ని చూపిస్తుందో..?