వీళ్ల‌ని చూసైనా మ‌న వాళ్లు మార‌తారా?

Update: 2022-09-24 06:13 GMT
త‌మిళ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెల‌ర‌కెక్కించిన భారీ పీరియాడికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వ‌న్'. దాదాపు 40 ఏళ్ల క‌ల‌ని ఇప్ప‌టికి మ‌ణిర‌త్నం నెర‌వేర్చుకుంటున్నారు. ఎంజీ ఆర్ నుంచి ర‌జ‌నీకాంత్‌, క‌మ‌మ‌ల్ హాస‌న్, ద‌ళ‌ప‌తి విజ‌య్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వ‌ర‌కు చాలా మందితో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకురావాల‌ని మణిర‌త్నం గ‌త 40 ఏళ్లుగా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. బ‌డ్జెట్‌, న‌టీన‌టులు, ఫైనాన్షియ‌ర్ ల స‌మ‌స్య కార‌ణంగా ఈ ప్రాజెక్ట్ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

ఎట్ట‌కేల‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్గాలు ముందుకు రావ‌డంతో ఇన్నేళ్ల మ‌ణిర‌త్నం క‌ల ఎట్ట‌కేల‌క కార్య‌రూపం దాల్చింది. చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ మూవీని రెండు భాగాలుగా అత్యంత భారీ స్థాయిలో మ‌ణిర‌త్నం రూపొందించారు. సెప్టెంబ‌ర్ 30న తొలి పార్ట్ పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. తెలుగులో ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.  

సినిమా రిలీజ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని ప్పీడ‌ప్ చేసేసింది. రీసెంట్ గా తెలుగులోనూ ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించారు. ఇందులో భాగంగా చిత్ర బృందం హైద‌రాబాద్ లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్ లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుక‌ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన తీరు, ఆర్టిస్ట్ లు టైమ్ కి హాజ‌రైన తీరు.. కార్య‌క్ర‌మాన్ని ఇన్ టైమ్ లో  సోదిలేకుండా క‌రెక్ట్ టైమ్ కి ముగించిన తీరుపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

ఈ కార్య‌క్ర‌మంలో శ‌ర‌త్ కుమార్, విక్ర‌మ్‌, కార్తి, ఐశ్వ‌ర్యారాయ్‌, త్ర‌విష‌, జ‌యం ర‌వి, విక్ర‌మ్ ప్ర‌భు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. రిలీజ్ ఏర్పాట్ల‌లో భాగంగా మ‌ణిర‌త్నం హాజ‌రు కాలేక‌పోయారు. ఇక ఆయ‌న త‌రుపున సుహాసిని హాజ‌రు కాగా ఏ. ఆర్‌. రెహామాన్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. అయితే ఇంత భారీ ఈవెంట్‌.. భారీ తారాగ‌ణం పాల్గొన్న ఈవెంట్ లో ఒక్క బౌన్స‌ర్ క‌నిపించ‌క‌పోవ‌డం విశేషం. ఆర్టిస్ట్ ల స‌మ‌య‌పాల‌న ప్రేక్ష‌కుల‌ని మంద్ర ముగ్ధుల్ని చేసింద‌ట‌.
 
మన వాళ్లు వీళ్ల‌ని చూసి చాలా నేర్చుకోవాల‌ని నెటిజ‌న్ లు ప్ర‌స్తుతం సెటైర్లు వేస్తున్నారు. మ‌న సినిమా ఫంక్ష‌న్ అంటే హీరోనే లాస్ట్ లో 9 గంట‌ల‌కు చేరుకోవ‌డం.. అంత వ‌ర‌కు రోటీన్ ఏవీలు, డ్యాన్స్ లు గ‌ట్రా చూపిస్తూ టైమ్ వేస్ట్ చేయ‌డం.. హీరో ఆల‌స్యంగా రాగానే బౌన్స‌ర్ ల హ‌డావిడి మొద‌లు కావ‌డం తెలిసిందే. విలువైన స‌మ‌యాన్ని వృధా చేస్తున్న మ‌న వాళ్లు ఈ హంగామాని అంతా ప‌క్క‌న పెట్టి నీట్ గా ఈవెంట్ ని పూర్తి చేసిన 'పొన్నియిన్ సెల్వ‌న్‌' టీమ్ ని చూసైనా మారాల‌ని అంతా కోరుకుంటున్నారు. మ‌రి మ‌న వాళ్లు మార‌తారా? అన్న‌ది సందేహ‌మే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News