కన్నడ నటి పూజా గాంధీ మరోసారి వివాదంలో నిలిచింది. గతంలో కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆమెపై సౌత్ ఇండియా మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తాయి. దాంతో పాటు దండుపాళ్యం చిత్రంలో ఈమె పోషించిన పాత్రపై కూడా విమర్శలు వచ్చాయి. విమర్శలను పట్టించుకోకుండా తన పనేదో తాను చూసుకుంటూ వెళ్తున్న అమ్మడు తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈసారి ఒక హోటల్ లో బస చేసి బిల్లు చెల్లించలేదు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. దాంతో పాటు ఈమె పై కేసు కూడా నమోదు అయ్యిందని కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
2016 ఏప్రిల్ నుండి 2017 మార్చి వరకు పూజా గాంధీ మరియు ఆమె స్నేహితుడు అయిన అనిల్ పీ మీనాసినకాయ్ లు బస చేశారు. వీరిద్దరు కూడా దాదాపు సంవత్సర కాలం ఆ హోటల్ లో బస చేసినందుకు గాను మొత్తం 26.22 లక్షల బిల్లు అయ్యింది. ఆ బిల్లును వారు చెల్లించేందుకు సంవత్సరం తీసుకున్నారు. 2018వ సంవత్సరంలో అనిల్ హోటల్ బిల్లును చెల్లించాడు. అయితే ఆ సమయంలో ఆయన 22.83 లక్షలను మాత్రమే చెల్లించాడు. మిగిలిన బ్యాలన్స్ అమౌంట్ అయిన 3.35 లక్షల బిల్లును అదుగో ఇదుగో అంటూ జరుపుతూ వస్తున్నాడు. తాజాగా ఆ బిల్లు నిమిత్తం అమౌంట్ చెక్ రాసి ఇవ్వడం జరిగిందట. అయితే అసలు తాను అనిల్ తో కలిసి రూంలో ఉండలేదు అంటూ పూజా గాంధీ అంటోంది.
అనిల్ రాసి ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో వివాదం పోలీసుల వద్దకు వెళ్లింది. తమకు ఇవ్వాల్సిన అమౌంట్ అడిగితే చెల్లని చెక్ ను అనిల్ ఇచ్చాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో పూజా గాంధీ పేరును కూడా హోటల్ సిబ్బంది చేర్చారని కన్నడ సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వివాదంపై పూజా గాంధీ స్పందిస్తూ... తాను జేడీ చక్రవర్తి సినిమా నిమిత్తం ఆ హోటల్ లో ఉన్న మాట వాస్తవమే - అయితే తన రూం బిల్లును అప్పుడే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాను - అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా నా వద్ద ఉన్నాయి. అనవసరంగా నన్ను ఈ వివాదంలోకి లాగుతున్నారు అంటూ పూజా గాంధీ ఆవేదన వ్యక్తం చేసింది. నేను సినిమా స్క్రిప్ట్ సిట్టింగ్స్ కోసం రూం తీసుకున్నాను - దానికి సంబంధించిన బిల్లులు చెల్లించాను అని క్లారిటీగా చెబుతోంది. అయితే ఆమె వాదనలో నిజం లేదని, అనిల్ తో కలిసి ఆమె హోటల్ లో బస చేసింది అంటూ కొందరు గట్టిగా చెబుతున్నారు. ఈ కేసు పోలీసుల వరకు వెళ్లింది కనుక పూర్తి వివరాలు - రహస్యాలు త్వరలోనే బయటకు రావడం ఖాయం అంటూ కన్నడ పరిశ్రమ వర్గాల వారు అంటున్నారు.