తానొకటి తలిస్తే అన్న చందంగా రాధేశ్యామ్ విషయంలో జరిగింది. దాదాపు నాలుగైదేళ్ల పాటు తపస్సు చేశాడు ఈ మూవీ కోసం దర్శకుడు రాధాకృష్ణ. కానీ ఆరంభం నెగెటివ్ రివ్యూలు నిజంగానే చిత్రబృందాన్ని కలవరపరిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ - పూజా హెగ్డే జంట ఈ సినిమా కోసం చాలా శ్రమించారు. కానీ క్రిటిక్స్ వైపు నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.
మార్చి 11న విడుదలైన రాధే శ్యామ్ దేశవ్యాప్తంగా మిశ్రమ సమీక్షలను అందుకున్నా ఆరంభ వసూళ్లను అదరగొట్టిందని ట్రేడ్ తెలిపింది. చాలా మంది విమర్శకులు ఈ చిత్రాన్ని డిజాస్టర్ అని తేల్చేసారు. ముఖ్యంగా ప్రభాస్ తన మునుపటి పాన్-ఇండియా ఫ్రాంచైజీ బాహుబలితో తెచ్చిన క్రేజ్ ముందు ఇంకేదీ నిలవడం లేదని కూడా మరోమారు ప్రూవ్ అయ్యింది. చాలా ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ జానర్ పరంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించినా రిజల్ట్ పరంగా ఆశించినది దక్కలేదు. తాజాగా పూజా హెగ్డేను రాధే శ్యామ్ రిజల్ట్ గురించి.. సమీక్షల గురించి ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించింది.
విధి రాత అంటూ సినిమాటిక్ గా స్పందించినా కానీ గమ్మత్తయిన జవాబిచ్చింది పూజా. ఇందులో ప్రేరణగా తన నటనకు మాత్రం ప్రేక్షకులు పేరు పెట్టలేదని అందరూ ప్రేమగా పిలుస్తున్నారని ఉబ్బితబ్బిబ్బయ్యింది. సమీక్షల్లో తన పాత్ర గురించి గొప్పగా రాసారని కూడా ఆనందించింది. అయితే ప్రతి సినిమాకి సమీక్షలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ఫేట్ వేరుగా ఉంటోందని విశ్లేషించింది.
సినిమా యావరేజ్ అన్న టాక్ వచ్చినా లేదా ఫ్లాప్ అని టాక్ వచ్చినా కానీ కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద ఫిగర్స్ చాలా బావుంటున్నాయని.. బావుంది అని చెప్పినా బాక్సాఫీస్ నంబర్స్ వద్ద ఫెయిలైనవి ఉన్నాయని దీనంతటికీ విధిరాతే కారణమని తాను నమ్ముతానని కూడా సెలవిచ్చింది.
ప్రతి సినిమాకు దాని స్వంత విధి ఉంటుందని దానిని తాను గట్టిగా నమ్ముతానని పూజా చెప్పారు. కొన్నిసార్లు మీరు సినిమా చూసి..ఓహ్ ఇట్స్ జస్ట్ ఓకే ఫిల్మ్ అని అనుకుంటారు. కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మాత్రం బాగానే ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడని కొన్ని సినిమాలు ఉన్నాయి. కానీ అది చూశాక మీరు ``అయ్యో.. ఈ సినిమా ఎందుకు సరిగ్గా నడవలేదో నాకు అర్థం కాలేదు. ఇది చాలా బాగుంది`` అని అంటారు. కాబట్టి ప్రతి చిత్రానికి బాక్సాఫీస్ వద్ద దాని విధి ఉంటుందని నేను భావిస్తున్నాను... అని ఎంతో క్లాస్ గా చెప్పింది పూజా.
రాధే శ్యామ్ ని సక్సెస్ చేసేందుకు నాయకానాయికలు ఎంతగా శ్రమించారో తెలిసినదే. చాలా కష్టపడి పనిచేసినప్పటికీ ఒక మోస్తరు ప్రశంసలు మాత్రమే దక్కాయి. అయితే ఈ చిత్రంలో తన నటనను ప్రజలు మెచ్చుకోవడంతో తాను సంతోషంగా ఉన్నానని పూజ తెలిపింది. ప్రేక్షకులు నా నటన గురించి కూడా మాట్లాడుతున్నారు.. నటిగా నేను నిజంగా ఎలా మెరుగుపడ్డాను అన్నది చెబుతుంటే ఆనందంగా ఉంది అని పూజా అంది.
నిజానికి ట్విట్టరట్టి కూడా భావోద్వేగ సన్నివేశాలలో పూజ నటనను ప్రశంసించింది. అన్నింటికంటే ప్రేరణ పాత్ర వీక్షకులతో కనెక్టయ్యింది. మీరు మీ జీవితంలోని నాలుగు సంవత్సరాలు సినిమా తీయడానికి పెట్టినప్పుడు మీరు మీ హృదయాన్ని మీ ఆత్మను ఉంచినప్పుడు అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. అది ప్రశంసలకర్హం. మీరు నిజంగా మంచి అనుభూతి చెందుతారు`` అని పూజా అంది.
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తో మళ్లీ మరో సినిమా చేస్తారా అని పూజను అడిగారు. ``ఆశిద్దాం. అతనికి ఇప్పుడు భారీ లైనప్ ఉంది. కాబట్టి ఆ తర్వాత కావచ్చు`` అని పూజ వెల్లడించింది. రోహిత్ శెట్టి `సర్కస్` సెట్స్ లో ప్రస్తుతం పూజా హెగ్డే బిజీగా ఉంది. దళపతి విజయ్ సరసన బీస్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసినదే.