కొత్త అందాలు లేవు.. పాత అందాలే దిక్కు!

Update: 2020-02-22 10:00 GMT
టాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉండే హీరోయిన్ల కొరత ఉందనేది వాస్తవం.  హీరోయిన్ల సంఖ్య ఎక్కువే కానీ వారిలో నటన ఉన్నవారికి గ్లామర్ ఉండదు.. గ్లామరస్ గా ఉండేవారికి నటన రాదు. పోనీ ఈ రెండూ ఉన్నాయి కదా అనుకుంటే హిట్లు రావు.. ప్రేక్షకులూ పట్టించుకోరు. దీంతో స్టార్ హీరోల సినిమాలకు ఛాయిస్ పెద్దగా ఉండడం లేదు.  శ్రియ.. కాజల్.. తమన్నా లాంటివారు ఇప్పటికే సీనియర్లు.. కొత్త హీరోయిన్లలో ఒకరిద్దరికి తప్ప మిగతా వారికి ప్రేక్షకుల్లో క్రేజ్ లేదు.  ఈ కారణాల వల్ల పూజా లేకపోతే రష్మిక అన్నట్టు తయారయింది పరిస్థితి.

ఈమధ్యే #ఎన్టీఆర్30 ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ఇదో క్రేజీ ప్రాజెక్ట్.  ఈ సినిమాకు హీరోయిన్లుగా పూజా హెగ్డే.. రష్మిక మందన్నలను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం.  దీన్ని బట్టే ఫిలిం మేకర్లకు హీరోయిన్ల విషయంలో ఇతర ఆప్షన్స్ లేవనే సంగతి అర్థం అవుతోంది.  ఈ సినిమాకే కాకుండా సెట్స్ పై ఉండే ఇతర స్టార్ హీరోల సినిమాలకు హీరోయిన్ల ఎంపిక కష్టంగా మారిందని అంటున్నారు.

సీనియర్ హీరోయిన్లను తీసుకుందామని ప్రయత్నించినా బయ్యర్ల నుండి వ్యతిరేకత వస్తోందని అంటున్నారు. ప్రేక్షకుల్లో పాత హీరోయిన్ల పట్ల క్రేజ్ లేదని.. పూజా హెగ్డే లాంటి క్రేజీ హీరోయిన్లయితేనే సినిమా పై ఆసక్తి కలుగుతుందనే వాదన వినిపిస్తోంది. మరి ఈ హీరోయిన్లకు పోటీనిచ్చి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సాధించే సత్తా ఉన్న ముద్దుగుమ్మలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఏమో.

    

Tags:    

Similar News