హేయ్ పూజా ఏమిటీ బ‌డితె పూజ‌?

Update: 2020-01-23 12:53 GMT
2020 చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ గా నిలిచింది సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌. అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెస్ కి మ్యూజిక్ ఆల్బ‌మ్ ఎంత పెద్ద‌ ప్ల‌స్ అయ్యిందో.. ఈ ఒక్క పాటా అంతే అస్సెట్ అయ్యింది. యూట్యూబ్ స‌హా అన్ని మాధ్య‌మాల్లోనూ ఈ పాట కోట్లాది వ్యూస్ తో ఎంతో గొప్ప‌గా వైర‌ల్ అయిపోయింది. బుల్లితెర కార్య‌క్ర‌మాల్లోనూ ఎక్కువ‌గా అనుస‌రించిన పాట‌గా రికార్డులు బ్రేక్ చేసింది. ప్ర‌తి ఒక్క‌రి పెద‌వుల‌పైనా సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ప‌దం ఊత‌ప‌దంగా మారిందంటే ఎంత‌గా క‌నెక్ట‌య్యిందో ఊహించ‌వ‌చ్చు.

ఈ పాట‌ను ప్ర‌తిచోటా యూత్ హ‌మ్ చేస్తూనే ఉన్నారింకా. అయితే ఇప్పుడు చిత్ర క‌థానాయిక పూజా హెగ్డే నేరుగా స‌క్సెస్ వేదిక‌పై గాయ‌నిగా మారిపోయి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ఆల‌పించింది. వైజాగ్ ఈవెంట్లో పూజా పాట‌కు చిత్ర‌బృందం లేచి చ‌ప్ప‌ట్లతో మోతెక్కించేశారు. వ‌చ్చీ రాని భాష‌తో ప‌ల‌క‌లేని ప‌దాల‌తో ఒక ర‌కంగా పూజా చాలానే తంటాటు ప‌డినా.. త‌న ప్ర‌య‌త్నానికి మెచ్చి అంతా చ‌ప్ప‌ట్లు కొట్టారు. పూజా పాడుతుంటే.. త‌న వెంటే ఉన్న‌ థమన్ ఆమె పాటకి తగ్గట్టుగా బీట్ అందించాడు.

అయితే తన పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ ఆక‌ట్టుకుంటున్న పూజా ఇలా లైవ్ వేడుక‌లో పాట పాడే సాహ‌సం చేసేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఇంకా భాష‌పై ప‌ట్టు లేక‌పోవ‌డంతో కొన్ని ప‌దాల్ని అర్థ‌వంతంగా ప‌ల‌క‌లేక‌పోయింది. హిందీ భాష అంత సులువుగా తెలుగు ఎక్కేయ‌డం కుద‌ర‌దు. ప్ర‌పంచంలోనే నేర్చుకోవ‌డం అత్యంత క‌ష్టం అని చెప్పే భాష ఇది. అలాగే ఎక్కువ ప‌దాలు ఉండే భాష కూడా తెలుగు. అందుకే పూజా ఎంత ప్ర‌య‌త్నించినా ఇంకా తెలుగుపై ప‌ట్టు సంపాదించ‌లేక‌పోయింది. ఇక‌ ఈ పాట విన్న నెటిజనం ఇప్ప‌టికే సోషల్ మీడియాలో చెల‌రేగారు. పూజాను ఏకిపారేస్తున్నారు. ర‌క‌ర‌కాల‌ మీమ్స్ తో వెట‌కారం ఆడేస్తున్నారు. అయితే ఇంత‌కుముందు ఉత్త‌రాది నుంచి వ‌చ్చిన‌ సీనియ‌ర్ భామ‌లైన ఇలియానా .. శిల్పాశెట్టి.. ప్రీతి జింతా.. క‌త్రిన లాంటి డ‌స్కీ బ్యూటీస్ చేయ‌ని సాహ‌సం ఇప్పుడు పూజా చేయ‌డం మెచ్చ‌ద‌గిన‌దే. ముంబై ర్యాంప్ వాక్ బొమ్మ‌ల‌కు తెలుగు నేర్వాల‌న్న జ్ఞానం రావ‌డాన్ని హ‌ర్షించాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News