ఒక లైలా కోసం.. ముకుందా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే డీజే సినిమాతో టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకు పోతున్న ఈ అమ్మడు తమిళం మరియు హిందీల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగు లో ఈమె టాప్ స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన రాధే శ్యామ్ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో మొదటగా అఖిల్ తో నటించిన మోస్ట్ ఎలిబజబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్దం అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను అక్టోబర్ 8న దసరా కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం సినిమా చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. తాజాగా ఈ సినిమాకు తన పాత్రకు గాను పూజా హెగ్డే డబ్బింగ్ చెప్పుకుంది.
పూజా హెగ్డే ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించింది. కాని ఏ ఒక్క సినిమాలో కూడా ఆమె డబ్బింగ్ చెప్పిందే లేదు. ఆమె పాత్రలకు డబ్బింగ్ ను వేరే వారితో చెప్పించడం జరిగింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కు మాత్రం మొదటి సారి ఆమె డబ్బింగ్ చెప్పింది. తెలుగు సినిమాకు పూజా హెగ్డే డబ్బింగ్ చెప్పుకునేందుకు సిద్దం అవ్వడం అభినందనీయం. తెలుగు బాగానే మాట్లాడటంతో పాటు అర్థం చేసుకోగలిగిన పూజా హెగ్డే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కు తగ్గట్లుగా డబ్బింగ్ చెప్పి మెప్పించింది అంటూ సమాచారం అందుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలోని ఆమె పాత్రకు ఆమె తోనే డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని మొదటి నుండి అనుకున్నాడట. ఆమెతో డబ్బింట్ టెస్ట్ చేయగా సరిగ్గా సెట్ అయ్యిందని నిర్మాతలు అల్లు అరవింద్ మరియు ఇతర పెద్దలు కూడా భావించడంతో ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లో పాత్ర పూజా నిజ జీవితంకు దగ్గరగా ఉంటుందట. అందుకే ఈ పని చేశారంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా లో అఖిల్ తో సమానమైన పాత్రను పూజా హెగ్డే పోషిస్తుందని.. ఇద్దరి పాత్రలు కూడా సినిమాలో అత్యంత కీలకంగా ఉండటంతో పాటు కథలో చాలా ముఖ్యంగా ఉంటాయట. అందుకే ఆమెతోనే డబ్బింగ్ చెప్పిండం వల్ల పీల్ ఉంటుందని దర్శకుడు భావించాడు. అఖిల్ మరియు పూజా హెగ్డేల మద్య సాగే లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాలు సినీ అభిమానులను ఆకట్టుకుంటాయని మేకర్స్ అంటున్నారు. గత ఏడాది నుండి కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్న బ్యాచిలర్ ను దసరాకు తీసుకు రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.