ముకుంద, ఒక లైలా కోసం చిత్రాల్లో నటించింది పూజా హెగ్డే. ముంబై నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టి విజయాలు అందుకుంది. అంతకంటే ముందే మూగమూడి చిత్రంతో కోలీవుడ్‌లోనూ జీవా సరసన నటించి లక్ చెక్ చేసుకుంది. చక్కని నటి అన్న ప్రశంసలైతే వచ్చాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనకబడింది.
కారణం.. బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న 'మొహంజోదారో'కి సంతకం చేయడమే కారణం. ఇందులో హృతిక్ హీరో. ఈ సినిమా భారీ కాన్వాసుపై తెరకెక్కుతున్నది కాబట్టి రెండేళ్ల పాటు కేవలం ఆ ఒక్క సినిమాకే కాల్షీట్లు కేటాయించాల్సొచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా సగం పూర్తయిందని హింటిచ్చింది పూజా. మిగిలిన పార్ట్ పూర్తయితే ఇక మరోసారి తెలుగు, తమిళ్ సినిమాల గురించి ఆలోచించే అవకాశం ఉందని చెప్పకనే చెప్పింది.
పూజా తనంతట తనే బైటపడింది కాబట్టి ఇక నుంచి మన దర్శకనిర్మాతలు తనని కలిసి కథలు వినిపిస్తే సరిపోతుంది. మిగతా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుని దక్షిణాదికి వస్తుంది కాబట్టి ఈలోగా ముందస్తు ప్లాన్ అనుకూలిస్తుంది. మన స్టార్ హీరోలకు హీరోయిన్ల కొరత ఇప్పటికీ వదల్లేదు. పవన్, చరణ్, బన్ని, మహేష్, ఎన్టీఆర్ వీళ్లలో ఎవరైనా తదుపరి చిత్రాల కోసం అమ్మడిని ఎంపిక చేసుకోవచ్చు. చూసుకోండి గయ్స్.