`బాహుబ‌లి-3`పై ముందే క‌ర్చీప్ వేసేసిన‌ పూజాహెగ్డే!

Update: 2022-03-21 00:30 GMT
ప్ర‌భాస్-పూజాహెగ్డే జంట‌గా న‌టించిన `రాధేశ్యామ్` ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ప్ర‌మోష‌న్ టైమ్ లో డార్లింగ్-పూజాహెగ్డే చోటు చేసుకున్న ఎడ‌ముఖం..పెడ ముఖం స‌న్నివేశం గురించి చెప్పాల్సిన‌ ప‌నిలేదు. ఇద్ద‌రు బ‌ద్ద శ‌త్రువుల్లా వ్య‌వ‌హ‌రించిన వైనం ఇప్ప‌టికీ హాట్ టాపిక్నే. ఒకే వేదిక‌పై ఉన్నాఒకరి గురించి..ఒక‌రు మాట్లాడ‌కుండా ఉండ‌టం..క‌నీసం ముఖాలు సైతం చూసుకోకుండా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్ని ముగించారు.

`రాధేశ్యామ్` షూటింగ్ స‌మ‌యంలో చోటు చేసుకున్న పొర పొచ్చాలు కారణంగా ఈ వైరం మొద‌లైన‌ట్లు తెరైకి వ‌చ్చింది. `రాధేశ్యామ్` ప్ర‌చారంలో` ఆదిపురుష్` హీరోయిన్ ని  డార్లింగ్ హైలైట్ చేయ‌డం...రియ‌ల్  కెమిస్ర్టీ కాదు  డార్లింగ్ తో చూడాల్సింది రియ‌ల్ కెమిస్ర్టి అంటూ పూజాహేగ్దే వ్యాఖ్యానించ‌డం వంటి స‌న్నివేశాల‌తో నిజంగానే ఇద్ద‌రి మ‌ధ్య వైరం ఉందా? అనిపించింది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే..

తాజాగా డార్లింగ్ ని ఉద్దేశించి పూజా బ్యూటీ  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌భాస్ తో మ‌రో సినిమా చేయాల‌నుకుంటున్నారా? అనే ప్ర‌శ్న పూజ ముందుకు వెళ్లిన‌ప్పుడు `వైనాట్`  ఎందుకు కాదు అంటూ స‌మాధానం ఇచ్చింది. స‌రైన స్ర్కిప్ట్ వ‌స్తే అత‌నికి న‌టించ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని తెలిపింది. ప్ర‌భాస్ తో `బాహుబ‌లి -3` చిత్రాన్ని చేయాల‌నుకుంటున్నాను అంట న‌వ్వేసింది. మ‌రి ఇది సెటైరా? సీరియ‌స్ అన్నాది త‌ర్వాత  తేలుతుంది.

ఇట‌వ‌లే రాజ‌మౌళి `బాహులి-3` చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియ‌దు.కానీ క‌చ్చితంగా `బాహుబ‌లి -3` ఉంటుంద‌ని ఉద్ఘాటించారు. అందుకేనేమో పూజాహెగ్డే ముందుగానే బాహుబ‌లి -3పై క‌ర్చీప్ వేసిన‌ట్లు క నిపిస్తుంది. మ‌రి రాజ‌మౌళి ఏమంటారో?  రాజ‌మౌళి ప్రాజెక్ట్ కాబ‌ట్టి హీరోయిన్ విష‌యంలో డార్లింగ్ క‌ల్పించుకునే  అవ‌కాశం ఉండ‌దు. కాబ‌ట్టి పూజా హెగ్డే జ‌క్క‌న్న‌ని కాక‌ప‌డితే స‌రి.

ఇక పూజాహెగ్డే కోలీవుడ్ స్టార్ విజ‌య్ స‌ర‌స‌న `బీస్ట్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్న సినిమా త్వ‌రలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో జంట ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. విజ‌య్-పూజా పెయిర్ ఆన్ స్క్కీన్ పై బాగుందంటూ ప్ర‌శంలందుకుంటున్నారు. పూజా లో రొమాంటిక్ యాంగిల్..విజ‌య్ కి ప‌క్కాగా మ్యాచ్ అవ్వ‌డం వంటి స‌న్నివేశాలు చూస్తుంటే కోలీవ‌వుడ్ లో  పెద్ద హీరోయిన్ అవుతుందంటూ తంబీలు అప్పుడే కీర్తిస్తున్నారు.

విజ‌య్ స‌ర‌స‌న మాళ‌విక‌..న‌య‌న‌తార‌..కీర్తి సురేష్ వంటి భామ‌లు ఇటీవ‌ల కాలంలో న‌టించారు. కానీ వాళ్లెవ్వ‌రికీ ఈ ర‌క‌మైన అప్పీల్ ద‌క్క‌లేదు. హీరో-హీరోయిన్ల‌తో  పోలిస్తే  పూజాహెగ్డే  డిఫ‌రెంట్ అంటూ తంబీలు మురిసిపోతున్నారు. మొత్తానికి `బీస్ట్` రిలీజ్ కి ముందే పూజా పై కోలీవుడ్ లో పాజిటివ్ సైన్ మొద‌ల‌వ్వ‌డం విశేషం. ఇక తెలుగులో పూజాహెగ్డే సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌స‌ర‌స‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.
Tags:    

Similar News