PKతో పూజా.. చేస్తే ఒక బాధ, మిస్సయితే మరో బాధ!

Update: 2022-12-13 04:41 GMT
టాలీవుడ్ బుట్ట బొమ్మగా మంచి క్రేజ్ అందుకున్న పూజా హెగ్డే లక్కుతో అవకాశాలు అందుకుంటుంది అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. అలాంటి కామెంట్స్ ఎన్నీ వస్తున్నా కూడా ఈ బ్యూటీ మాత్రం అగ్ర హీరోలతో స్టార్ దర్శకులతో గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే ఆమెకు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో అలాగే అక్షయ్ కుమార్ తో సినిమాలు చేసే ఛాన్స్ దొరికింది. అలాగే మరో హిందీ సినిమా కూడా చర్చలో దశలో ఉంది. ఇక తమిళంలో కూడా సూర్య సినిమాలో నటించే అవకాశం రానుంది. ఇక ఈ బిజీ షెడ్యూల్లో ఆమె అగ్ర హీరోలతో అవకాశం వస్తే మాత్రం ఏదో ఒక రకంగా డేట్స్ సెట్ చేసుకుని సినిమాలను ఓకే చేయాలని అనుకుంటుంది.

పెద్ద సినిమాలను మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దని ఆలోచనతోనే వెళుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేయాలని ఆలోచనతో ఉందట. అసలైతే ఇదివరకే హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు ఆమెను అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎంతకు స్యార్ట్ కాకపోవడంతో అమ్మడు చేయలేనని చెప్పింది. ఇక హరీష్ శంకర్ కలయికలో ఇంతకుముందు డీజే గద్దల కొండ గణేష్ సినిమాలు వచ్చాయి. అవి బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే సక్సెస్ అయ్యాయి.

ఇక ఇప్పుడు హరీష్ శంకర్ కోసమైనా మరోసారి సెంటిమెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆఫర్ కు ఒప్పుకోవాలని అనుకుంటుందట. హరీష్ ఫోకస్ అంతా కూడా ఆమె పైనే ఉంది. కానీ పూజా హెగ్డే పవర్ స్టార్ తో సినిమా చేయాలని ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా డేట్స్ ఇవ్వడంలో కాస్త అనుమానంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే పవన్ తో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా అంటే అతని సమయానుకూలంగా షూటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన టీమ్ ద్వారా పవన్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రెడీగా ఉండాలి. ఎందుకంటే అతను మరో వైపు రాజకీయ అంశాలతో బిజీగా ఉంటున్నాడు.

కాబట్టి ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. అందుకే పవన్ కోసం సినిమా చేయడానికి ఒప్పుకుంటే చాలా డేట్స్ ఫ్లాష్ అవుతాయి అనే అనుమానం కూడా ఉంది. అందులోనూ ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా జనవరి మొదటిలోనే మొదలు కానుంది. మరి ఈ బిజీ షెడ్యూల్లో పూజా హెగ్డే పవర్ స్టార్ సినిమా చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News