ఫోటో స్టోరీ: సూటేసుకుని మరీ హీటెక్కిస్తోంది!

Update: 2020-03-03 12:30 GMT
టాలీవుడ్ లో మొదటి నుంచి పూజా హెగ్డేకి డిమాండ్ ఎక్కువే. ఈమధ్య 'అల వైకుంఠపురములో' విజయంతో పూజా డిమాండ్ మరింతగా పెరిగింది.  సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పూజ ఫోటో షూట్లు అసలు మానదు. ఇక ఏదైనా మ్యాగజైన్ వారు కనుక పూజా దగ్గరకు వస్తే చాలు కత్తిలాగా రెడీ అయ్యి  జర్మన్ మేడ్ చాకు లాగా పోజులిస్తుంది.

తాజాగా 'ది మ్యాగజైన్' అనే పత్రిక కోసం ఫోటో షూట్ చేసింది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసింది.  ఈ ఫోటోలకు "మైను సూట్ సూట్ కర్దా" అంటూ పంజాబీ భాషలో క్యాప్షన్ ఇచ్చింది. అంటే నాకు సూటు సూటవుతుంది అని అర్థమేమో మరి. గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఉన్న సూట్ ధరించి ఒక గోడకు ఆనుకుని నిలుచుంది.  ఎరుపు రంగు హై హీల్స్ ధరించింది. చాకొలేట్ కలర్ లిప్ స్టిక్.. సరైన మేకప్ తో ఒక సూపర్ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ నిలుచుంది.  ఈ ఫోటోలో హైలైట్ మాత్రం వీ-నెక్ వల్ల ఫోటోకు వచ్చిన హాట్ నెస్సే.  

ఈ ఫోటోకు ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఓ లైక్ వేసుకున్నాడు.   కామెంట్లలో ఒక లవ్ సింబల్ పెట్టాడు. ఇక సాధారణ నెటిజన్లు ఊరుకోరు కదా? "తెను సూట్ సూట్ కర్దా" అంటూ ఒకరు పూజా హెగ్డే క్యాప్షన్ కు పంజాబీలోనే బదులిచ్చారు. "ఏక్ నంబర్".. "సూపర్ హాట్" అంటూ మరికొందరు చెలరేగిపోయారు. ఇక పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News