4వేల ఏళ్ల క్రితం కూడా డిజైనర్ వేర్

Update: 2016-06-17 11:30 GMT
మొహెంజొదారో.. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్. సల్మాన్  సుల్తాన్ - షారుక్ రాయీస్ - అమీర్ దంగల్ చిత్రాల కంటే.. హృతిక్ రోషన్ నటించిన ఈ మొహెంజొదారో కోసమే ఎక్కువగా క్రేజ్ ఉంది. ఇందుకు కారణం.. ఇది చరిత్రను కళ్ల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్న మూవీ కావడమే.

మొహెంజొదారో అంటే ఇప్పట్లో ఏం కాదు. క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీ.పూ. 1900వరకూ నడిచిన చరిత్ర. ఇప్పటికి నాలుగున్నర వేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి. అందుకే ఈ మూవీపై అంతటి ఆసక్తి ఉంది. చరిత్ర కారుల భాషలో చెప్పాలంటే కొత్తరాతి యుగం ప్రారంభం కాలం అది. మొహెంజొదారో చరిత్ర.. కొత్త రాతి యుగం అంతమయ్యేనాటికే ముగిసింది. మరి ఈ కాలాన్ని కళ్ల ముందు చూపే ప్రయత్నం చేయడంతోనే.. మొహెంజొదారో పై అంతటి ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో హీరోయిన్ పూజా హెగ్డే లుక్ ని తాజాగా విడుదల చేసింది యూనిట్.

చూసేందుకు ఈ లుక్ అద్భుతంగా ఉంది కానీ.. న్యూ స్టోన్ ఏజ్ లో ఇంతటి డిజైనర్ వేర్ ఎక్కడ ఉందో దర్శకుడే చెప్పగలగాలి. నెత్తి మీద నాలుగు ఈకలు - డ్రస్సులో నాలుగు పూసలు ఇరికించేసి.. ఇదే 5వేల ఏళ్ల క్రితం గెటప్ అనుకోమన్నట్లుగా ఉంది. సినిమాటిక్ లిబర్టీ సహజమే కానీ.. మరీ రాతి యుగం నాటి సినిమా తీస్తూ కూడా.. హీరోయిన్ గ్లామర్ ని చూపేందుకు ఇంతగా స్వేచ్ఛ తీసేసుకోవడం మరీ దారుణం.
Tags:    

Similar News