టాలీవుడ్ లో వేగంగా మారుతున్న పరిణామాలు అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ 30 కి కొరటాల శివ దర్శకుడిగా ఫైనల్ అవ్వడం ఆ వెంటనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న త్రివిక్రమ్ మహేష్ తో సెట్స్ కెళ్లేందుకు రెడీ అవ్వడం చర్చనీయాంశమైంది. మహేష్ తో SSMB 28 ని మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా త్రివిక్రమ్ లాంచ్ చేస్తారని ప్రచారం సాగుతోంది.
ఈలోగానే ఇరు సినిమాలకు కథానాయికల్ని ఫైనల్ చేసేయడం ఆసక్తిగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ముంబై బ్యూటీ కియరా అద్వాణీని కథానాయికగా ఎంపిక చేయగా.. ఇప్పుడు మహేష్ సరసన పూజా హెగ్డేని త్రివిక్రమ్ కన్ఫామ్ చేసేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూజా ఓవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నా తనని టాలీవుడ్ లో బుట్టబొమ్మగా మలిచి గొప్ప ఖ్యాతిని తెచ్చిన గురూజీ త్రివిక్రమ్ కోసం కాదనలేకపోయిందట. ఇక పారితోషికం పెద్దగానే ముట్టజెబుతున్నారన్న గుసగుసా వేడెక్కించేస్తోంది. ఇక పూజాకి మహేష్ తో ఇది రెండో సినిమా కాగా త్రివిక్రమ్ తో మూడో సినిమా.
ఈ ఎంపికలతో ఇంతలోనే ఎంత వేగం? అంటూ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. తారక్ నటించే 30వ సినిమా.. మహేష్ నటించే 28 సినిమా ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. తారక్ తో సినిమాని కొరటాల -కళ్యాణ్ రామ్ బృందం అధికారికంగా ప్రకటించేయగా.. మహేష్ తో సినిమాని త్రివిక్రమ్- హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వర్గాలు ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయని తెలిసింది.