బుట్ట‌బొమ్మ ఏప‌నైనా క‌ష్టంతో కాదు ఇష్టంతో చేస్తుంది!

Update: 2022-12-02 05:39 GMT
బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే  టాలీవుడ్ ..బాలీవుడ్ ని దున్నేస్తోన్న సంగ‌తి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ న‌టిగా కొన‌సాగుతుంది. పాన్ ఇండియా చిత్రాల్లోనూ అవ‌కాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఆ మ‌ధ్య అమ్మ‌డిపై  టాలీవుడ్ లో కాస్త నెగిటివిటీ స్ర్పెడ్ అయినా నెమ్మ‌దిగా ఆ భారాన్నితొల‌గించుకోగ‌ల్గింది. అయితే ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌క‌న్నా హిందీ సినిమాలే ఎక్కువ‌గా అమ్మ‌డి ఖాతాలో క‌నిపిస్తున్నాయి.

భ‌విష్య‌త్ ని బాలీవుడ్ లోనే స్థిర‌ప‌రుచుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా పూజాహెగ్డే ముందుకు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న వెళ్లింది.  ప‌ని చేయ‌డాన్ని ఎప్పుడైనా ఒత్తిడిగా భావించారా? అంటే ఆ ప‌ద‌మే తెలియ‌దంటోంది.  'నాకు ప‌నిచేయ‌డం అంటే ఇష్టం. అది క‌ష్టంతో కాదు..ఇష్టంతో... క‌ష్టంగా భావిస్తే ఏప‌ని అయినా ఒత్తిడి తీసుకొస్తుంది.

అలాంటి సంద‌ర్భాలు లేవ‌ని కాదు. ఉన్నాయి కానీ...ఆ స‌మ‌యంలోనూ ఒత్తిడికి గురికాకుండా ప‌నిచేయ‌డ‌మే గొప్ప‌త‌నం. అక్క‌డే మ‌న‌మంటే ఏంటో తెలుస్తుంది. ఏప‌ని మొద‌లు పెట్టినా ఆరంభంలో బాగానే ఉంటుంది. కాసేపు ప‌నిచేసి అల‌సేస‌రికి చికాకుగా అనిపిస్తుంది. అప్పుడే మ‌నం ప‌ని ప‌ట్ల ఎంత క‌మిట్ మెంట్ తో ఉన్నామ‌న్న‌ది అర్ధ‌మ‌వుతుంది.

ఇష్టంగా భావిస్తే ఏపని ఒత్తిడి  తీసుకురాదు. ఇప్ప‌టికే నా క‌ల‌ల్ని చాలా వ‌ర‌కూ నిజం చేసుకోగ‌లిగా. ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగ‌లిగాను అంటే దానికి కార‌ణం సినిమాలపై నాకున్న ఇష్ట‌మే.   ఈ విష‌యాన్ని  చాలా  గ‌ర్వంగా చెబుతాను.  అందుకే ప‌నిలోకి దూకేందుకు  ఎప్పుడు ఆతృత‌గా ఎదురుచూస్తుంటా.  నిరంత‌రం ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా ఉప‌యోగాలున్నాయి.

మైండ్  డైవ‌ర్ట్ కాదు. ఎక్కువ‌గా మాట్లాడ‌టం త‌గ్గుతుంది. అందుకేనేమో మ‌నిషి ఎప్పుడూ ఖాళీగా ఉండ‌కూడ‌దు. ఏదో ప‌ని చేస్తూనే ఉండాలి అంటారేమో' అని తెలిపింది. మొత్తానికి పూజాహెగ్డే కి చాలా విష‌యాలే తెలిసాయ‌నిపిస్తుంది.

ప్రాక్టీక‌ల్ గా అలాంటి సిచ్వేష‌న్ ఎదురైతేనే వాటి గురించి అర్ధ‌మ‌వుతుంది. దానికి ప‌ర్య‌వ‌సానం ఏంట‌ని ఆలోచించ గ‌ల్గుతాం. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఎస్ ఎస్ ఎంబీ 28వ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్  మ‌హేష్  తో జ‌త‌క‌ట్ట‌డం ఇది రెండ‌వ‌సారి. గ‌తంలో 'మ‌హ‌ర్షి'లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News