అలంకారం లేకున్నా అందాలకేం తక్కువ

Update: 2017-09-28 04:38 GMT
హీరోయిన్లు అంటేనే తళుకుబెళుకు సొగసులు.. అందాలు కనిపించీ కనిపించకుండా ఉండేలా డిజైన్ చేసిన డ్రస్సులు..  ఆకాశం నుంచి నేలకు దిగొచ్చిన తారకలేమో అనిపించేలా అలంకరణలు... ఇవన్నీ చాలా కామన్ గా కనిపించే అంశాలు. ఇంత ఆర్భాటంతో తారాలోకపు సుందరీమణులు నడిచొస్తుంటే అభిమానులంతా వాళ్ల అందానికి దాసోహం అనేస్తుంటారు.

అదేం చిత్రమో... ఇవేం లేకుండానే దువ్వాడ జగన్నాథమ్ సుందరి పూజా హెగ్డే అభిమానుల గుండెలు కొల్లగొట్టేస్తుంది. తాజాగా ముంబయిలో ఓ కాస్మెటిక్ బ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ కు పూజా అటెండయింది. ఈ కార్యక్రమానికి ఆమె అసలు మేకప్ లేకుండా చాలా సాదా సీదాగా వచ్చేసింది. ఆమె వేసుకొచ్చిన డ్రస్ కూడా డిజైనర్ వేరేం కాదు.  బేసిగ్గా పూజా నాచురల్ బ్యూటీ.. అలాంటి అందానికి అలంకారాలు అంత అవసరమా? అందుకే మేకప్ సోకులు లేకపోయినా అందరి చూపులు ఆమెపైనే ఫోకస్ అయ్యాయి. పూజా హెగ్డేలో ఉండే సెక్సప్సీల్ పొడవాటి ఆమె కాళ్లే. ఈ ప్రోగ్రాంలో అమ్మడు మేకప్ హంగులు మిస్సయిందే కానీ తనకు అట్రాక్షన్ తెచ్చిపెట్టే అప్పియరెన్స్ ను మాత్రం మిస్సవ్వలేదు.

అసలు పూజా టాలీవుడ్ లో మొదటి సినిమాల్లో చాలా పద్ధతైన పాత్రల్లోనే కనిపించింది. ముకుంద - ఒక లైలా కోసం సినిమాలు ఆమె అందానికి పేరు తెచ్చిపెట్టాయే కానీ అవకాశాలు తెచ్చిపెట్టలేదు. తనలో ఉన్న గ్లామర్ ను బయటపెట్టి దువ్వాడ జగన్నాథమ్ లో అందాలన్నీ ఆరబోసేసరికి ఈ సుందరికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ప్ర్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News