తెలుగలో చేయండి..హిందీ హీరోయిన్ అవ్వండి

Update: 2017-05-08 07:52 GMT
హింది హిరోయిన్లు  తెలుగూ సినిమాను వాళ్ళ కెరీర్ లో కిక్ స్టార్ట్ లా వాడుకుంటారేమో. ఇక్కడుకు వచ్చి ఒకటి రెండు సినిమాలు సక్సెస్ కొట్టాలి అనుకోవడం.. మళ్ళీ హిందికి లగెత్తడం.. ఇలా చాలా మంది చేశారు. కొత్త వాళ్ళు కూడా చేస్తున్నారు. ఉదాహరణకు  పోకిరి పిల్ల ఇలియానా కూడా అలానే చేసింది. కాజల్ తమన్నా అలాగే ప్రయత్నించి ఇక్కడ హిట్టయినా అక్కడ ఫ్లాపయ్యారు. తెలుగునెవ్వరూ సీరియస్ గా తీసుకున్నట్లు లేదు.

ఇప్పుడు అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పూజా హెగ్డే కూడా ఒకసారి ఇలానే చేసింది. తన మొదటి తెలుగు సినిమా 'ఒక లైలా కోసం' తరువాత లగాన్ సినిమా దర్శకుడు అశుతోష్ గోవారికెర్ సినిమాలో అవకాశం కొటేసింది. హృతిక్ రోశన్ తాజా ఫైల్యూర్ సినిమా మొహెంజో దారోలో పూజ బాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. కానీ ఆ సినిమా తో అంతగా అవకాశాలు రాలే కాబట్టి మళ్ళీ యు టర్న్ తీసుకొని తెలుగు లో దువ్వాడ జగన్నాధం సినిమాలో బన్నీ పక్కన హీరోయిన్ గా చేస్తుంది.

ఇప్పుడు మళ్ళీ ఒక బాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ అధినేత కరణ్ జోహర్ ఆఫీసు నుండి ఫోన్ వచ్చిందిని చెప్పుతున్నారు. రాబోయే సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2  స్క్రీన్ టెస్ట్ కోసం కిందటి వారం పిలిచారట. అది ఒకే ఐతే మళ్ళీ ఈ అమ్మడు తెలుగూ సినిమా కోసం ఆలోచించే ప్రయత్నం చేయదేమో. ఇదేదో మన తెలుగు వాళ్ళు హింది సినిమాకి హిరోయిన్లు సప్లయ్ చేస్తున్నట్లుందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News