ఫోటో స్టొరీ: లేడీ బ్రూస్ లీ గా డీజీ బ్యూటీ

Update: 2018-11-04 06:35 GMT
మన ఇండియన్ సీటీల్లో ఉన్న జనాల్లో ముప్పై శాతం మంది ఒంగి తమ బొటన వేలిని తాకలేరని ఈమధ్య ఒక సర్వేలో తేలింది. ఎందుకో చెప్పనవసరం లేదు కదా? కారణం పెద్ద పొట్ట ఉండడమే అని అందరికీ తెలిసిన విషయమే.  మనలాంటి వాళ్ళకు బాన పొట్ట ఉంటే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ గ్లామర్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకు మాత్రం చాలా కష్టం. అందులోనూ హీరోయిన్లు ఎంత స్లిమ్ముగా ఎంత ఫిట్టుగా ఉంటే అంత మంచిది.

డీజే బ్యూటీ పూజా హెగ్డే ఈ సూత్రాన్ని బాగానే ఒంటబట్టించుకున్నట్టుంది. అందుకే ఎడా పెడా కసరత్తులు చేసిపారేస్తోంది.  మరి బికీనీ అవతారం లో కనిపించాలంటే ఆ మాత్రం కసరత్తులు తప్పనిసరి. కానీ ఆమె అంతటితో ఆగకుండా బ్రూస్ లీ.. చాకీ చాన్ ల స్టైల్లో కుంగ్ ఫూ అంటోంది.  రీసెంట్ గా ఒక కాలిని వర్మగారి లేడీ బ్రూస్ లీ లాగా పైకి లేపింది. దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  దానికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ "చార్లీస్ ఏంజెల్స్ అంటారా లేదా కుంగ్-ఫూ పూ-జా అంటారా, మీరే ఒకటి ఎన్నుకోండి".   మీరు కూడా పూ-జా లాగా చైనీస్ కసరత్తులు చేసేవారైతే సరేగానీ.. లేకపోతే ఆమె కాలెత్తినట్టు కాలు మాత్రం ఎత్తకండి.  ఏదైనా జరగొచ్చు.  ఈ ఫోటో ఒక్కటే కాకుండా ట్రైనర్ తో ఫైట్ చేస్తున్న మరో వీడియో కూడా పోస్ట్ చేసింది పూ-జా.

ఇలాంటి హాటు హాటు యాక్షన్ బ్యూటీ కాబట్టే పూజకు ఇన్స్టాలో 4 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు.  ఇక సినిమాల సంగతి మాట్లాడుకుంటే మహేష్ బాబు 'మహర్షి'.. #ప్రభాస్20 సినిమాల్లో నటిస్తోంది.  వీటితో పాటుగా బాలీవుడ్ ఫిలిం 'హౌస్ ఫుల్ 4' లో కూడా నటిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News