లోకనాయకుడు కమల్ హాసన్ వరుస చిత్రాలతో బిజీగా ఉండడమే గాక బుల్లితెరపై బిగ్ బాస్ షోకి హోస్ట్ గా రక్తి కట్టిస్తున్నాడు. ప్రస్తుతానికి వ్యక్తిగత జీవితం పరంగా చూస్తే అతడు ఒంటరిగా ఉన్నాడు. ఎవరితోనూ రిలేషన్ లో లేడు. అయితే సీనియర్ నటుడు కమల్ 'విశ్వరూపం' సహనటి పూజా కుమార్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడనే పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. గత రెండున్నరేళ్లుగా ఈ జంట రహస్య వ్యవహారాలపై పుకార్లు షికార్లు చేస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి స్పందనా లేదు. ఎట్టకేలకు కమల్ హాసన్ తో తన ఎఫైర్ గురించి వచ్చిన పుకార్లపై పూజా కుమార్ స్పందించారు.
''నాకు కమల్ హాసన్ సార్ ఆయన కుటుంబం చాలా కాలంగా తెలుసు. నేను తనతో పనిచేయడం ప్రారంభించినప్పటి నుండి ఈ పుకార్లు మొదలయ్యాయి. వీటిని ఎవరూ నమ్మొద్దు'' అని అన్నారు. ''నాకు కమల్ సర్ కుటుంబం.. నిర్మాత అయిన అతని సోదరుడు.. అతని కుమార్తెలు శ్రుతి - అక్షర అందరూ తెలుసు. నేను వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. వారి కుటుంబ కార్యక్రమాలలోను కొంత భాగంగా ఉంటాను'' అని పూజా కుమార్ తెలిపారు. ఇలాంటి సాన్నిహిత్యం వల్లనే బహుశా ఈ పుకార్లు పుట్టుకొచ్చి ఉండొచ్చని వాటిని నమ్మొద్దని పూజా కుమార్ కోరారు.
ఇంతకుముందు కమల్ హాసన్ పుట్టినరోజు వేడుకల్లో పూజా కుమార్ ని అతని కుటుంబ ఫోటోల్లో చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆ ఫోటోలు ఆన్ లైన్ లో కనిపించిన వెంటనే దానిపై విస్త్రతంగా చర్చ సాగింది. పూజా కుమార్ కూడా కమల్ హాసన్ కుటుంబ చిత్రంలో ఒక భాగం అయ్యింది. ఆమె హాసన్ కుటుంబంలో భాగమా? కమల్ హాసన్ కి సహచరి అయ్యిందా? అంటూ సందేహం వ్యక్తం చేసారు. కానీ ఆ వార్తలను పూజా కుమార్ కొట్టి పారేసారు.
కమల్ హాసన్ నటి సారికను 1988లో వివాహం చేసుకున్నారు. 2002లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కమల్ - సారిక జంటకు శ్రుతిహాసన్ - అక్షర హాసన్ జన్మించారు. అలాగే పూజా కుమార్ ఇటీవల కమల్ హాసన్ నటించిన 'తలైవన్ ఇరుక్కింద్రన్'లో తన పాత్రపైనా పుకార్లపైనా స్పందించింది. ఈ సినిమాలో ఎలాంటి పాత్ర కోసం మేకర్స్ తనను సంప్రదించలేదని పూజా కుమార్ పేర్కొంది.
తలైవన్ ఇరుక్కింద్రన్ కథ ఇదీ తలైవన్ ఇరుక్కింద్రన్ తమిళ-హిందీ ద్విభాషా చిత్రం. ఈ చిత్రంలో కమల్ హాసన్- సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ దర్శకత్వం వహించనున్నారు. తలైవన్ ఇరుక్కింద్రన్ టైటిల్ ను కమల్ హాసన్ 2011లోనే ఎంపిక చేసారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటిస్తారని కొన్ని కథనాలు వచ్చాయి. కానీ అప్పట్లో ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. ఈ చిత్రం భారతీయ రాజకీయ వ్యవస్థను దాని పునాదులను కదిపేంత బలమైన కథతో తెరకెక్కనుందన్న ఊహాగానాలు సాగాయి. ఇప్పటికీ దీనిపై గుసగుసలు వేడెక్కిస్తూనే ఉన్నాయి. కమల్ హాసన్- సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఇలాంటి క్రేజీ సినిమాలో పూజా కుమార్ ఆఫర్ దక్కించుకుందని దానికి కారకుడు కమల్ సర్ అని కూడా కథనాలు వైరల్ అయ్యాయి. కానీ ఇటీవల కమల్ హాసన్ భారతీయుడు 2 పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తదుపరి కొత్త ప్రాజెక్ట్ ని కమల్ హాసన్ పూర్తి చేస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.